twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ ఔట్, కళ్యాణ్ రామ్ మాత్రం.....

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నందమూరి కుటుంబంలో అనుకోని విషాదం. హరిక్రిష్ణ తనయుడు జానకిరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. సోదరుడి మరణంతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విషాదంలో మునిగి పోయారు. బాధలో ఉన్న ఆయన నటిస్తున్న ‘టెంపర్' షూటింగులో పాల్గొనలేక పోతున్నాడు. ఈ పరిణామాలతో షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈచిత్రం విడుదల మరింత లేటవుతుందని అంటున్నారు.

    ఎన్టీఆర్ షూటింగులో పాల్గొన్నా సరిగా కాన్సన్ట్రేట్ చేసే పరిస్థితి లేక పోవడంతో దర్శకుడు పూరి జగన్నాథ్...అతడు పూర్తిగా తేరుకున్న తర్వాతే షూటింగ్ జరుపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో చేసేది లేక బండ్ల గణేష్ కూడా ఒప్పుకోక తప్పలేదు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యే సరికి సంక్రాంతి పండగ అయిపోతుంది కాబట్టి.....ప్రస్తుతం ఎన్టీఆర్ సంక్రాంతి బరి నుండి ఔట్ అని ఫిల్మ్ నగర్ టాక్.

    NTR’s ‘Temper’ is out of Sankranti race

    అయితే....కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్' చిత్రం ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ చిత్రం ఈ నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం'పటాస్‌'. రచయిత అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్‌ పోలీసు అధికారిగా కనిపిస్తారు. కందిరీగ, ఆగడు సినిమాలకు రైటర్‌ గా పనిచేసిన అనిల్‌ రవిపూడి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పటాస్‌ అనేదే మాస్‌ టైటిల్‌, అలాంటి ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ లో కళ్యాణ్‌ రామ్‌ ఫూర్తి రఫ్‌ లుక్‌ లోకనిపించనున్నారు. కళ్యాణ్‌ రామ్‌ నిర్నిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.

    ఇందులో హీరోయిన్ గా శ్రుతి సోధి నటిస్తోంది. పంజాబీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రుతి. అటు అందంగా కనిపించడంతోపాటు ఇటు నటనలోనూ రాణిస్తోంది. కథలో మలుపులు రక్తికట్టించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    NTR’s ‘Temper’ is out of Sankranti race, Kalyanram is planning to release 'Patas’ in the month of January 2015.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X