For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఘనంగా ఎన్టీఆర్ కొత్త చిత్రం ఓపినింగ్(ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్: ఎన్టీఆర్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్లో రానున్న సినిమా ఈ రోజు(బుధవారం)ఉదయం మొదలైంది. శ్రీ కాణిపాక వరసిద్ది వరసిద్ది వినాయకస్వామి ఆశీస్సులతో బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. సమంత హీరోయిన్.

  రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లకొండ సురేష్ నిర్మించిన 'కందిరీగ' చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'కందిరీగ-2' చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు కూడా. అయితే 'కందిరీగ-2'కి ఆదిలోనే హంసపాదులా.. మొదట్లోనే రకరకాల సమస్యలు వచ్చాయి. దర్శకుడు, నిర్మాతల విభేధాలతో ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే ఇన్నాళ్ళ తర్వాత ఆ ప్రాజెక్టు పట్టాలు ఎక్కుతోంది.

  ఎన్టీఆర్ సరసన సమంత చేసే ఈ చిత్రానికి సమర్పణ బెల్లంకొండ సురేష్, నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సంతోష్ శ్రీనివాస్... శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ ప్రై లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తారు.

  చిత్రం ప్రారంభోత్సవం సిని ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.

  ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ కెమెరా స్విచ్చాన్ చేసారు.

  ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు.

  శ్రీను వైట్ల గౌరవ దర్శకత్వం వహించారు.

  బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... 2012 మార్చి 28న మా ఆది విడుదలైంది. ఆ సినిమాను మా లక్ష్మి నరసింహా పతాకంపై విడుదల చేసాం. ఇప్పుడు అదే బ్యానర్ పై ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాం. అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా ఇది.. అని తెలిపారు.

  బెల్లంకొండ గణేష్ బాబు మాట్లాడుతూ... తారక్, సమంత కలిసి నటిస్తున్నారు. కందిరీగ మా బ్యానర్ లో పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుంది. అని చెప్పారు.

  దర్శకుడు మాట్లాడుతూ... ఆదిలాంటి సినిమా చేసిన బ్యానర్ లో నేను సినిమా చేయటం ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ కు కథ చెప్పగానే ఓకే అన్నారు. ఎన్టీఆర్ నమ్మకం ఎంత గొప్పదో.. ఈ సినిమా అంత గొప్పగా ఉంటుంది. అని తెలిపారు.

  కోన వెంకట్ మాట్లాడుతూ.. గొప్ప సినిమా ఇది.తారక్ తో ఈ సినిమా మొదలు కావడంతో నేను చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. తారక్ చురుకుతనం, సమంత ఆకతాయితనం, వాసు పనితనం, బెల్లంకొండ సురేష్ భారీతనం కలిస్తే సినిమా అవుతుంది. వైలంట్ సబ్జెక్టులకు కాలం చెల్లిపోయింది. అన్నారు.

  చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర హైలెట్ గా ఉంటుందని, చాలా ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టు అని చెప్తున్నారు.

  కందిరీగను మించే సబ్జెక్టు అని యూనిట్ చెప్తోంది.

  మే 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలువుతుంది.

  బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... "ఎన్టీఆర్ కి ఫరఫెక్ట్ గా సూట్ అయ్యే అధ్బుతమైన సబ్జెక్టు సంతోష్ శ్రీనివాస్ రెడీ చేసారు. కథ వినగానే ఎన్టీఆర్ ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా చేస్తానని చెప్పారు. ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటించే ఈ చిత్రంకు సంభందించిన మిగతా వివరాలను త్వరలోనే తెలియచేస్తాము" అన్నారు.

  ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగనుంది. ఈ చిత్రం కథ వినగానే ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చినట్లు చెప్తున్నారు.

  ఈ చిత్రానికి రభస అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

  ఈ చిత్రానికి ఆర్ట్: ఎ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: శ్యామ్ కె నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహేంద్రబాబు, నిర్మాత: బెల్లంకొండ గణేష్ బాబు, కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్

  English summary
  Muhurat of NTR’s latest film on Sri Lakshmi Narasimha Productions banner was held on the morning of 13 February at Annapurna studios. NTR sounded the clapboard, VV Vinayak switched on the camera and Seenu Vytla directed the first shot. Director Santosh Srinivas said, “NTR Has okayed the story immediately after listening to it. The trust NTR kept on the story made me more responsible towards this project.”
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X