»   » ఎన్టీఆర్‌ కన్నడంలో పాడిన క్షణాలు...(ఫొటోలు)

ఎన్టీఆర్‌ కన్నడంలో పాడిన క్షణాలు...(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అనుకున్నట్లుగానే కన్నడ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ కోసం ఎన్టీఆర్ పాట పాడారు . ఈ విషయాన్నీ ఎన్టీఆర్ ట్వీట్ చేసి మరీ ధృవీకరించారు. పునీత్‌ నటిస్తున్న 25వ కన్నడ చిత్రం ఇది. ప్రస్తుతం ఎన్టీఆర్ సైతం తన 25వ చిత్రం చేస్తున్నారు.

ఆ చిత్రం ఇప్పుడు సెట్స్‌పై ఉంది. ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. తమన్‌, పునీత్‌ల కోసం ఇందులో ఎన్టీఆర్‌ ఓ పాట ఆలపించాడు. త్వరలోనే ఎన్టీఆర్‌ పాడిన ఈ పాటని యూ ట్యూబ్ లో విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్‌లో ఓ ఓ మంచి సింగర్ సంగతి తెలిసిందే. ‘యమదొంగ', ‘కంత్రి', ‘అదుర్స్‌', ‘రభస' చిత్రాల కోసం గొంతు సవరించుకొన్నాడు ఎన్టీఆర్‌. ఇప్పుడు డిఫెరెంట్ గా కన్నడంలో పాటను పాడారు.

ఎన్టీఆర్ ట్వీట్ ఇలా సాగింది

ఎన్టీఆర్ ట్వీట్ ఇలా సాగింది

ఎన్టీఆర్‌ కన్నడంలో పాడిన క్షణాలు...(ఫొటోలు)


ఈ విషయమై తమన్ ట్వీట్ చేస్తూ...

కన్నడంలోనూ...

కన్నడంలోనూ...

ఎన్టీఆర్ తెలుగులోనే కాదు..కన్నడంలో మంచి మార్కెట్ ఉంది. అక్కడ ఆయన సినిమాలు బాగా బిజినెస్ చేసుకుంటూంటాయి. అందుకేనేమో ఇప్పుడు తన కన్నడ ఫ్యాన్స్ కోసం ఆయన పాట పాడారు.

నిర్మాత మంచి ఫ్రెండ్

నిర్మాత మంచి ఫ్రెండ్

ఆ చిత్రం నిర్మాత లోహిత్...ఎన్టీఆర్ కు మంచి ఫ్రెండ్ కావటం కూడా ఈ పాట పాడటానికి ఓ కారణం.

క్రేజ్

క్రేజ్

పునీత్‌ నటిస్తున్న 25వ కన్నడ చిత్రం చక్రవ్యూహ ఇప్పుడు సెట్స్‌పై ఉంది. ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి మంచి క్రేజే ఉంది.

ఇంకోటి

ఇంకోటి

అలాగే ‘నాన్నకు ప్రేమతో' చిత్రంలోనూ ఎన్టీఆర్‌ ఓ పాట పాడినట్టు తెలుస్తోంది.

English summary
Ntr sing a song for Power star Puneeth Rajkumar's next much awaited Chakravyuha produced by lohith.
Please Wait while comments are loading...