For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను దేవుడిని కాదు: అభిమానుల వికృత చర్యను ఖండించిన ఎన్టీఆర్ (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జనతా గ్యారేజ్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈచిత్రం ఆడియో రిలీజ్ వేడుక శుక్రవారం శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరిగింది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమాంతా, నిత్యా మీనన్ లు కథానాయికలు.

  ఆడియో రిలీజ్ సందర్భంగా జూ ఎన్టీఆర్ సినిమా గురించి, దర్శకుడి కొరటాల శివ, ఇతర టెక్నీషియన్లు పడ్డ కష్టం గురించి, నిర్మాతల నుండి అందిన సపోర్టు గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకొచ్చారు. మోహన్ లాల్ వంటి గొప్ప నటుడు, మంచి మనిషి తో కలిసి నటించడం తన అదృష్టంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

  టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల తర్వాత తాను చేస్తున్న గొప్ప సినిమా 'జనతా గ్యారేజ్', ఈ సినిమా తన కెరీర్ ను మరో లెవల్ కి తీసుకెళ్లే సినిమా, పుష్కరాల తర్వాత అభిమానులు ఒక భారీ విజయాన్ని చూడబోతున్నారనే నమ్మకం ఉందని అని ఎన్టీఆర్ తెలిపారు.

  12 సంవత్సరాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలు జరుగుతున్నాయని, ఇతర రాష్ట్రాల నుండి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే వారితో తెలుగు వారి గొప్పదనం తెలిసే ప్రవర్తించాలని ఎన్టీఆర్ సూచించారు.

  ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మహానుభావుడు ఎన్టీఆర్ గారికి మనవడిగా పుట్టాను.... ఇంత మంది అభిమానులు నాకు దొరకడం నా అదృష్టం. మీ అందరికీ ఆ జన్మాంతం రుణపడి ఉంటాను అని చెప్పిన ఎన్టీఆర్.... అభిమానం పేరుతో కొందరు ఫ్యాన్స్ చేస్తున్న చర్యలను, వికృత చేష్టలను ఈ సందర్భంగా ఖండించారు. దయచేసి అలాంటివి చేయొద్దని వేడుకున్నారు. ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశిస్తూ విన్నవించిన, ఖండించిన విషయాలకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

   నేను దేవుడిని కాదు..

  నేను దేవుడిని కాదు..

  నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో కొందరు అభిమానులు తన పోస్టర్లపై పాలాభిషేకం చేయడంపై ఎన్టీఆర్ స్పందించారు. అలాంటివి చేయడానికి తానేమీ దేవుడిని కాదని, మీ అన్ననో, తమ్ముడినో అంతే తప్ప నన్ను దేవుడిగా మార్చొద్దని, అభిషేకాలు చేయొద్దని విన్నవించుకున్నారు.

  దానం చేయండి

  దానం చేయండి

  తన పోస్టర్లకు అభిషేకాలు చేసి పాలు వృధా చేసే అనాధల శరణాలయంలో పిల్లలకు దానం చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందని, పుణ్యం వస్తుందని ఎన్టీఆర్ వేడుకున్నారు.

  పోషకాహారం లేక మాడిపోతున్నారు

  పోషకాహారం లేక మాడిపోతున్నారు

  భారత దేశంలో ఎంతో మంది గర్భిణిలు, చిన్న చిన్న పిల్లలు పోషకాహారం లేకుండా మాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మీరు పాలను అలా వృధా చేయడం ద్వారా ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదు. వారికి దానం చేస్తే మీ అందరికీ పుణ్యం దక్కుడంతో పాటు నాకు దక్కుతుందని ఎన్టీఆర్ కోరారు.

  మూగ జీవాల్ని బలిస్తూ వికృత చేష్టలపై

  మూగ జీవాల్ని బలిస్తూ వికృత చేష్టలపై

  నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో కొందరు అభిమానులు థియేటర్ల వద్ద మూగజీవాల్ని అత్యంత పాశవికంగా బలిచ్చిన వీడియోలు అప్పట్లో ఇంటర్నెట్లో వైరల్ లా వ్యాపించాయి. దీనిపై ఎన్టీఆర్ స్పందించారు.

  సినిమా అంటే అది కాదు..

  సినిమా అంటే అది కాదు..

  సినిమా అంటే ప్రాణం పోయడమే తప్ప ప్రాణం తీయడం కాదు. అలాంటి బలిచ్చే కార్యక్రమాలు చేయొద్దు. కావాలంటే థియేటర్లో అన్నదానం లాంటివి చేయండని ఎన్టీఆర్ వేడుకున్నారు.

  మీ అభిమానాన్ని కాదనను

  మీ అభిమానాన్ని కాదనను

  నేను మీ అభిమానాన్ని కాదనడం లేదు... కానీ ఇలాంటి చర్యల వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదు.... అదేదో మంచి మార్గంలో చూయండి, పది మందికి సాయం చేయండి అని ఎన్టీఆర్ అభిమానులను కోరారు.

  దయచేసి...

  దయచేసి...

  నేను చెప్పిన ఈ విషయాలు ఆడియో వేడుక ప్రాంగణంలో ఉన్న అభిమానులులు, టీవీల్లో చూస్తున్న అభిమానులు పాటిస్తారని ఆశిస్తున్నాను అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

  జాగ్రత్తగా వెళ్లండి

  జాగ్రత్తగా వెళ్లండి

  ఇంటి వద్ద మీ కోసం అమ్మా నాన్న ఎదురు చూస్తున్నారు. జాగ్రత్తగా వెళ్లాలని ఎన్టీఆర్ అభిమానులకు సూచించారు.

  సమంత, నిత్య గురించి

  సమంత, నిత్య గురించి

  సమంత, నిత్య మీనన్ లతో కలిసి ఈ సినిమాకు పని చేయడం మరిచిపోలేని అనుభూతి అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

  సినిమాటోగ్రాఫర్ తిరు

  సినిమాటోగ్రాఫర్ తిరు

  సినిమాటోగ్రాఫర్ తిరు గురించి మాట్లాడుతూ... జనతా గ్యారేజ్ సినిమాలో అభిమానులు అద్భుతమైన విజువల్స్ చూడబోతున్నారు, ఆ గొప్పదనం అంతా సినిమాటోగ్రాపర్ తిరుదే అని ఎన్టీఆర్ పొగిడారు.

   ఏ జన్మలో...

  ఏ జన్మలో...

  ''ఏ జన్మలో నేను చేసిన పుణ్యమో ఏమో కానీ మహానుభావుడికి మనవడిగా, అద్భుతమైన తల్లిదండ్రులకు కొడుకుగా, మీ లాంటి వారికి అన్నగా, తమ్ముడిగా పుట్టే అవకాశం కలిగింది. ఈ రుణం తీరిపోనిదని అనుకుంటాను అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

  నిన్ను చూడాలని టైంలో..

  నిన్ను చూడాలని టైంలో..

  పన్నెండేళ్ళకు ఒకసారి పుష్కర కాలం వస్తుంది. నిన్ను చూడాలని సినిమా టైంలో ఎక్కడికెళుతున్నానో, ఏమవుతున్నానో తెలిసేది కాదు. తర్వాత ఆది సినిమా, తర్వాత సింహాద్రి సినిమా దక్కింది అన్నారు ఎన్టీఆర్.

  మొట్టికాయలు

  మొట్టికాయలు

  అంత బాగా ఉంది కదా అనిపించింది. కానీ మనం దేవుడి కంటే గొప్పవాళ్ళం అయిపోలేం. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ప్రతి వ్యక్తి క్రిందకు పడిపోవాలి. దేవుడు మొటిక్కాయలు మొట్టి నువ్వు క్రిందకు పడరా..అప్పుడే నీకు జీవితం అంటే తెలుస్తుందని అన్నాడు అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

  నాలో నేను కుమిలిపోయాను

  నాలో నేను కుమిలిపోయాను

  చాలా కాలం నేనెంత బాధపడ్డాను. అభిమానులెంత బాధపడ్డారో తెలుసు. నాలో నేను కమిలిపోయాను. కానీ ఒకరోజు వక్కంతం వంశీ టెంపర్‌ కథ చెప్పాడు. దూరంగా వెలుగులా ఆ కథ కనపడింది అన్నారు.

  పూరి గురించి

  పూరి గురించి

  పూరి జగన్నాథ్‌ అనే దర్శకుడు స్వతహాగా మంచి రచయితే అయినా ఏదో చేద్దామనుకని నాకంటే ముందు పరిగెత్తాడు. అందరం ముందుకెళ్లాం గమ్యానికి దగ్గరయ్యాం అన్నారు ఎన్టీఆర్.

  నాన్నకు ప్రేమతో

  నాన్నకు ప్రేమతో

  తర్వాత నాన్నకు ప్రేమతో సినిమా వచ్చింది. ఆ సినిమాకు ముందు నా లుక్‌ చూసి చాలా మంది ఇదేంటి ఇలా ఉంది. ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని అనుకున్నారు. కానీ అభిమానులు ఆశీర్వాదం, నమ్మకంతో నా గమ్యం ఇంకా దగ్గరైంది అని ఎన్టీఆర్ తెలిపారు.

  జనతా గ్యారేజ్

  జనతా గ్యారేజ్

  ఇపుడు లైట్‌ ఇంకా దగ్గర కనపడింది. ఆ లైట్‌ ఏదో కాదు జనతాగ్యారేజ్‌. రెండు సంవత్సరాలు క్రితం శివ నాకు చెప్పిన కథే ఇది. నాకున్న ప్లాప్‌ సినిమాలతో బిజీగా ఉండి కథ విని చేయలేదు అన్నారు ఎన్టీఆర్.

  కొరటాల శివ గురించి..

  కొరటాల శివ గురించి..

  రచయిత కలం ఎప్పుడు అగకూడదు. ఆ రచయిత కలం అగిపోతే తర్వాత ఏ సినిమా చేయాలో అర్థం కాదు. అదే దర్శకుడికి ఆ రాతను ఎంత తక్కువ చేసి చూపించాలో ఆ చూపు దర్శకుడికి ఉండాలి. చాలా తక్కువ మంది రచయితలకు రచనతో పాటు దర్శకుడి చూపు కూడా ఉంటుంది. అలాంటి అతి తక్కువ మంది దర్శకుల్లో నా కొరటాల శివ ఉన్నాడని చెప్పడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

  మనసు పెట్టి

  మనసు పెట్టి

  రచయిత కొరటాల శివ ఒక కథ రాస్తాడు. దానికి ఒక కథానాయకుడిని ఎన్నుకుంటాడు. ఆ కథను అతనితో తప్ప మరెవరితోనూ చేయరు అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

  హాట్రిక్

  హాట్రిక్

  లా తక్కువ మంది దర్శకులు మాత్రమే వరుస సక్సెస్‌లు ఇస్తారు. ఆ వరుసలో చూసుకంటే జనతాగ్యారేజ్‌ శివకు హ్యాట్రిక్‌ చిత్రమవుతుంది. కొరటాల శివకు థాంక్స్‌ అని ఎన్టీఆర్ సభాముఖంగా ప్రకటించారు.

  మోహన్ లాల్ గురించి...

  మోహన్ లాల్ గురించి...

  ఈ సినిమా ద్వారా గొప్ప నటుడి పక్కన , గొప్ప మనిషి, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పక్కన నటించే అవకాశాన్ని కల్పించాడు శివ. మోహన్ లాల్ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేం. చాలా ఆనందంగా ఉంది అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

  దేవిశ్రీ గురించి..

  దేవిశ్రీ గురించి..

  దేవి గురించి ఎన్నిసార్లు చెప్పినా,ఎంత చెప్పినా తక్కువే. వర్క్‌ గురించి ఎప్పుడూ ఆలోచించి దేవిలాంటి వ్యక్తులు అరుదు. పాట కోసం తను పడే కష్టం అంతా ఇంతా కాదు. దేవితో వర్క్‌ చేయడం అమేజింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

  రామ జోగయ్య శాస్త్రి గురించి...

  రామ జోగయ్య శాస్త్రి గురించి...

  రామజోగయ్య శాస్త్రి గారు ఎంతో బాగా రాస్తారు కాబట్టే సింగిల్‌ కార్డ్‌ సాంగ్స్‌ రచయిత అయ్యాడని పొగిడారు ఎన్టీఆర్.

  నిర్మాతల గురించి..

  నిర్మాతల గురించి..

  ఈ చిత్ర నిర్మాతలు ఎంతో మంచి మనసున్న నిర్మాతలు. వీరెన్నో మంచి చిత్రాలు చేసి తెలుగు సినిమా ఎదుగులకు తోడ్పాడాలి అన్నారు.

  కొరటాల శివ మాట్లాడుతూ..

  కొరటాల శివ మాట్లాడుతూ..

  కొరటాల శివ మాట్లాడుతూ ''ఇది ఫ్యామిలీ ఫంక్షన్‌లా ఫీలవుతున్నాను. ఈ సినిమా నాకు చాలా స్పెషల్‌ అని చెప్పుకొచ్చారు.

  ఎన్టీఆర్ అక్కడ నా జర్నీ మొదలైంది.

  ఎన్టీఆర్ అక్కడ నా జర్నీ మొదలైంది.

  రైటర్‌గా పెద్దగా ఎదగనప్పుడు బృందావనం రాశాను. పెద్దగా మాట్లాడేవాడిని కాను. ఇదే వేదికపై అన్న ఎన్టీఆర్‌గారు నన్ను పరిచయం చేశారు. అక్కడ నుండి నా జర్నీ స్టార్ట్‌ అయ్యింది. అందుకే ఎన్టీఆర్‌ సినిమా అంటే నాకు స్పెషల్‌ అన్నారు కొరటాల.

  బ్లాక్ బస్టర్ కొట్టి ఆయనతో...

  బ్లాక్ బస్టర్ కొట్టి ఆయనతో...

  ఎన్టీఆర్‌ ఎనర్జీకి మ్యాచ్‌ చేసేలా రాయాలని ఎప్పుడూ అనుకుంటూ ఈ సినిమా కోసం పనిచేశాను. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ కొట్టి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎప్పుడూ మెయిన్‌టెయిన్‌ చేయాలని కోరుకుంటున్నాను అని కొరటాల చెప్పుకొచ్చారు.

  మోహన్ లాల్ గురించి కొరటాల

  మోహన్ లాల్ గురించి కొరటాల

  చిన్నప్పుడు మోహన్‌లాల్‌గారు సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనలాంటి వ్యక్తికి నేను యాక్షన్‌ చెప్పాను. అంతకు మించి బెస్ట్‌ యాక్టర్స్‌ ఎన్టీఆర్‌, మోహన్‌లాల్‌ను ఒక ఫ్రేమ్‌లో పెట్టి యాక్షన్‌ చెప్పాను. అది నాకు చాలు అని కొరటాల తెలిపారు.

  నాకు చాలా సుడి ఉంది

  నాకు చాలా సుడి ఉంది

  నాకు చాలా సుడి ఉంది కాబట్టే ఎన్టీఆర్, మోహన్ లాల్ ఇద్దరినీ కలిపి సినిమా చేసే అవకాశం దక్కిందని తెలిపారు.

  బెస్ట్ టీం

  బెస్ట్ టీం

  సేఫ్ గా ఉండటానికి నేను ఎప్పుడూ బెస్ట్‌ టీంను పెట్టుకుంటాను. సినిమాటోగ్రాఫర్‌గారు తిరుగారు అద్భుతమైన టెక్నిషియన్‌. ఆయనతో పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూ వచ్చాను. చాలా ఎగ్జయిట్‌మెంట్‌ ఇస్తూ ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు అని తెలిపారు.

  దేవిశ్రీ గురించి..

  దేవిశ్రీ గురించి..

  దేవిశ్రీప్రసాద్‌గారు గురించి ఎంత చెప్పినా తక్కువే. సీన్‌ చెబుతున్నప్పుడే ఆయన ప్రణామం ట్యూన్‌ ఇచ్చారు. అంతటి స్పాంటేనియస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్‌ని అని తెలిపారు కొరటాల.

  బాగా చేసారు

  బాగా చేసారు

  ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌ మంచి అవుట్‌పుట్‌ ఇచ్చాడు. ప్రతి సీన్‌కు ఎలాంటి మూడ్‌ ఉంటుందో దానికి తగ్గ వర్క్‌ ఇచ్చారు. రామజోగయ్యగారు మంచి సాహిత్యాన్ని ఇచ్చారు అన్నారు.

   నిర్మాతలు

  నిర్మాతలు

  నిర్మాతలు నెమ్మదస్థులు, మంచివాళ్లు. సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టే ప్యాషన్‌ ఉన్న నిర్మాతలు. వారికి స్పెషల్‌ థాంక్స్‌ అని కొరటాల శివ తెలిపారు.

  బ్లాక్ బస్టర్ కొడతాం

  బ్లాక్ బస్టర్ కొడతాం

  సెప్టెంబర్‌2న ప్రేక్షకులకు ముందుకు వస్తున్నాం. కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది అనే నమ్మకం వ్యక్తం చేసారు కొరటాల శివ.

  English summary
  Check out NTR speech at Janatha Garage audio release. Janatha Garage is an upcoming 2016 Indian Telugu action film directed by Koratala Siva and produced by Naveen Yerneni, Y. Ravi Shankar, and C. V. Mohan under their banner Mythri Movie Makers
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X