»   » ఎన్టీఆర్: 45 రోజులు లండన్ లోనే...షెడ్యూల్ డిటేల్స్

ఎన్టీఆర్: 45 రోజులు లండన్ లోనే...షెడ్యూల్ డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్‌, సుకుమార్‌ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే.బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్ గా చేస్తోంది. జగపతిబాబు కీలక పాత్రధారి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ నెల 25 నుంచి లండన్‌లో షూటింగ్ మొదలెడతారు. అక్కడ దాదాపు 45 రోజుల పాటు షూటింగ్ జరుపుతారు. కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలూ తెరకెక్కిస్తారు. ఈలోగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సారథ్యంలో పాటల్ని సిద్ధం చేస్తున్నారు.

తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. తండ్రి ఆశయాల్ని నెరవేర్చే తనయుడిగా ఎన్టీఆర్‌ కనిపిస్తారు. ఈ చిత్రానికి 'నాన్నకు ప్రేమతో' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు.

NTR-Sukumar film Shooting from 25th!

చిత్రం డిటేల్స్ కు వెళితే...

'దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర..' అంటూ బాక్సాఫీసుకు తన 'టెంపర్‌' చూపించాడు ఎన్టీఆర్‌. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న ఎన్టీఆర్‌.. కొంత విరామం తీసుకొని మళ్లీ కెమెరా ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.

నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ..‘ఎన్టీఆర్, సుకుమార్ ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రమిది. ఎన్టీఆర్ కి మా బేనర్లో ఇది మరో సూపర్ హిట్ మూవీ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ దేవిశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో స్పెయిన్ లో జరిగాయి. దేవి ఐదు అద్భుతమైన పాటల్నిఇచ్చారు అని తెలిపారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ తో ఫస్ట్ టైమ్ వర్క్ చేయటం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తారక్ లో ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ఎలివేట్ చేసే స్కోప్ ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇది ఓ రివేంజ్ డ్రామా. డిఫెరెంట్ స్టైల్ లో ఉంటుంది అన్నారు.

ఈచిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్: నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.

English summary
The first ever combination movie of Jr NTR and Sukumar is going to be kick-started on 25th. Like we said earlier, the movie is going to have its muhurat shot done in London. Unlike his previous films that have mass and local backdrop, this film of NTR is going to have foreign backdrop. The flick will be shot in UK, parts of Europe and in couple of other countries too. BVSN Prasad is producing the movie and Devi Sri Prasad is scoring music.
Please Wait while comments are loading...