»   »  ఇంట్రస్టింగ్ : ఎన్టీఆర్ 40 టేకుల కథ, సుక్కు,ఎన్టీఆర్ ఒకరి గురించి ఒకరు ఇలా

ఇంట్రస్టింగ్ : ఎన్టీఆర్ 40 టేకుల కథ, సుక్కు,ఎన్టీఆర్ ఒకరి గురించి ఒకరు ఇలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు సుకుమార్ కి ఎన్టీఆర్ సెంటిమెంట్ గా మారినట్టున్నాడు సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన మొదటి సినిమా కుమారి 21ఎఫ్ ఎన్టీఆర్ తో మొదలుపెట్టారు. ఆ సినిమాకి మంచి హైప్ వచ్చింది యావరేజ్ స్థాయిని కూడా దాటిపోయింది. అందుకేనేమో ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా 'దర్శకుడు' మూవీ టీజర్ లాంఛింగ్ ఈవెంట్ జరిగింది. సుకుమార్ రైటింగ్స్ రూపొందిన ఈ చిత్రం టీజర్ లాంఛింగ్ ను కూడా ఎన్టీఆర్ చేతుల మీదుగానే చేయించారు. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన 'దర్శకుడు' టీజర్ ను ఎన్టీఆర్ చేతుల మీదుగా లాంచ్ చేసిన సందర్భంగా సుకుమార్.. 'నాన్నకు ప్రేమతో' అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలని చెప్పాడు. అదే సమయం లో జూనియర్ కూడా కొన్ని సంగతులని పంచుకున్నాడు. ఈ ఇద్దరి మాటలూ అక్కడకు వచ్చిన వాళ్ళకి మంచి ఫీల్ ని ఇచ్చాయట.

ఎన్టీఆర్ తో నా అనుబంధం

ఎన్టీఆర్ తో నా అనుబంధం

‘‘ఎన్టీఆర్ తో నా అనుబంధం గురించి వివరించాలంటే ఒక కథ చెప్పాలి. ఒక బౌద్ధ గురువు.. అతడి శిష్యుడు కలిసి ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణం చేస్తున్నారు. వాళ్లు వంద మైళ్ల దూరం ప్రయాణించాలి. మధ్యలో వారికి ఓ అమ్మాయి కనిపించింది. ఆ రోజు తన పెళ్లి చూపులు కావడంతో బట్టలు పాడవకుండా నది ఎలా దాటాలా అని చూస్తుంటుంది.

మీరు సన్యాసి అయి ఉండి

మీరు సన్యాసి అయి ఉండి

బౌద్ధ గురువును సాయం అడుగుతుంది. ఆయన ఆమెను ఎత్తుకుని నది దాటిస్తాడు. ఐతే ఇది చూసి శిష్యుడు ఆశ్చర్యపోతాడు. చాలా దూరం ప్రయాణించాక ఉండబట్టలేక గురువును అడుగుతాడు. మీరు సన్యాసి అయి ఉండి అమ్మాయిని ఎలా తాకారు.. మోశారు.. అని అడిగితే..

తారక్ గురువు

తారక్ గురువు

‘నేనా అమ్మాయిని ఎప్పుడో దించేశాను. నువ్వు మాత్రం ఇంకా మోస్తూనే ఉన్నావు' అని బదులిస్తాడు గురువు. ఇక్కడ తారక్ గురువు అయితే.. నేను శిష్యుడిని. అతను ‘నాన్నకు ప్రేమతో' సినిమాను ఒడ్డునపడేసి తన పాటికి తాను వెళ్లిపోయినా.. నేనింకా ప్రేమతో అందులోనే ఉండిపోయాను.

కుమారి 21 ఎఫ్

కుమారి 21 ఎఫ్

ఎన్టీఆర్ నా ప్రొడక్షన్లో వచ్చిన తొలి సినిమా ‘కుమారి 21 ఎఫ్' టీజర్ లాంచ్ చేయడమే కాక.. ఆ సినిమా చూసి చేసిన ట్వీట్తో అది చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయింది. మళ్లీ ఇప్పుడు తనతోనే టీజర్ లాంచ్ చేయిద్దామని అడగాలంటే ఇబ్బందిగా అనిపించింది. కానీ అడగ్గానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాడు. ఇకపై కూడా నా ప్రొడక్షన్లో వచ్చే ప్రతి సినిమా టీజర్ తనతోనే లాంచ్ చేయిద్దామనుకుంటున్నా'' అంటూ నవ్వేశాడు సుకుమార్.

ఒక్క సీన్ కోసం 40 సార్లు రీటేక్

ఒక్క సీన్ కోసం 40 సార్లు రీటేక్

అదే సందర్భం లో నాన్నకు ప్రేమతో సమయం లో సుకుమార్ తనతో పర్ఫెక్ట్ గా వర్క్ ని రాబట్టుకోవటానికి ఏం చేసాడో చెప్పాడు యంగ్ టైగర్. అప్పటి షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్న జూనియర్.. 'ఒక సీన్ కోసం అయితే విపరీతంగా తపన పడ్డాడు. ఒక్క సీన్ కోసం నాతో 40 సార్లు రీటేక్ చేయించాడు.

ప్యాషన్ ఆ స్థాయిలో ఉంటుంది

ప్యాషన్ ఆ స్థాయిలో ఉంటుంది

సినిమాపై సుకుమార్ ప్యాషన్ ఆ స్థాయిలో ఉంటుంది' అని చెప్పాడు ఎన్టీఆర్.రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టిన రోజున 'ఓన్లీ సింగిల్ టేక్ హీరో' అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్.. యంగ్ టైగర్ కు ట్యాగ్ ఇచ్చి పొగిడాడు. అలాంటి నటుడితోనే ఏకంగా 40 టేకులంటే ఇక సుకుమార్ పర్ఫెక్షన్ కోసం ఎంత తపిస్తాడో వేరే చెప్పేదేముందీ అని చెప్పటం జూనియర్ ఇలా చెప్పటం లోని ఉద్దెశ్యం అన్న మాట.

English summary
Jr. NTR looked completely in his element and jovial mood at the teaser launch event of Darshakudu He went on to share a memory from his shoot of Nannaku Prematho...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu