»   »  ఆ హీరో ఎన్టీఆర్ కు రాక్షస స్నేహితుడు

ఆ హీరో ఎన్టీఆర్ కు రాక్షస స్నేహితుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అందరికంటే మంచు మనోజ్‌గాడు... నా రాక్షస స్నేహితుడు. ఇద్దరం ఒకే రోజు పుట్టాం. వాడికంటే నేను ఐదుగంటలు ముందు పుట్టానంతే. దానికే వాడు ‘అన్నయ్య.. బాబాయ్‌' అని పిలుస్తుంటాడు. వాడి అల్లరి అంతా ఇంతా కాదు.. వంద కోతులతో సమానం అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ మాట్లాడుతూ... నాకు దొరికిన అద్భుతమైన వరం.. నా స్నేహితులు. స్నేహల్‌, లవ్‌రాజ్‌, రాజీవ్‌ కనకాల.. ఇలా ఏడెనిమిదిమంది ఉన్నారు. ఎన్టీఆర్‌లా కాకుండా.. తారక్‌లా, నన్ను నన్నుగా చూస్తారు. స్నేహల్‌ అయితే తిడతాడు, కొడతాడు... అది నాకిష్టం. నాకు చుట్టూ మనుషులు ఉండాలి.. ఎంతమంది ఉంటే అంత సంతోషం.

NTR takls about other friends

వ్యక్తిగత జీవితం, వృత్తిగత జీవితం రెండూ వేరు. వాటిని కలపడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నా స్నేహితులతో కూడా పని గురించి ఎక్కువగా మాట్లాడుకోను. కలిస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇంట్లోనే క్రికెట్‌ ఆడేసుకుంటాం. కాకపోతే బ్యాటింగ్‌ ఎప్పుడూ నేనే. అవుట్‌ అయినా.. ఒప్పుకోను. ఎందుకంటే అది నా రాజ్యం. రామ్‌చరణ్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌.. మేమంతా సరదాగానే ఉంటాం. అయితే.. మా స్నేహాన్ని బయటపెట్టుకునే అవకాశం ఎప్పుడో గానీ రాదు అన్నారు.

అవును ..ఎన్టీఆర్ కు ఇండస్ట్రీలో క్లోజ్ గా ఉండేవాళ్లు ఎవరు..అసలు ఎక్కువగా నమ్మే క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరూ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా...రీసెంట్ గా ఓ లీడింగ్ న్యూస్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్ వ్వూలో ఈ విషయాలను గూర్చి చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. తన 25 సంవత్సరాల సినీ జర్నీ గురించి మాట్లడుతూ తన క్లోజ్ ప్రెండ్స్ గురించి కూడా చెప్పుకొచ్చాడు. ఇందులో అందర్ని ఆశ్చర్యపరిచే విధంగా అయాన తన స్నేహితులేవరో తెలిపారు.

ఇంతకు వారేవరంటే, రామ్ చరణ్, మహేష్ బాబు మరియు అల్లు అర్జున్ తనకు క్లోజ్ ప్రెండ్స్ అని తెలిపారు. మేం కలిసినప్పుడు చాలా సరదాగా గడుపుతామని, అవాకాశం దొరికినప్పుడల్లా మా స్నేహానికి సంబందించిన విషయాలు గుర్తుచేసుకుంటామని ఎన్టీఆర్ తెలిపారు. ఇది వినడానికి చాలా ఆనందంగా వుంది.

English summary
NTR revealed an interesting aspect about his friendship with top stars of the industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu