»   » సూపర్‌హిట్ కోసం చేసిన సినిమా కాదిది...ఎన్టీఆర్

సూపర్‌హిట్ కోసం చేసిన సినిమా కాదిది...ఎన్టీఆర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక మంచి ప్రయత్నమైతే మేం చేశాం. ఎన్టీఆర్‌ని కొత్త కోణంలో చూపించిన సినిమా. అంతేకానీ సూపర్‌హిట్ సినిమా చెయ్యాలనే ఉద్దేశంతో చేసిన సినిమా కాదు. సక్సెస్‌లో టీమ్ వర్క్ ఎంత ఉంటుందో, ఫ్లాపులోనూ టీమ్ వర్క్ అంతే ఉంటుంది. అది ఏ ఒక్కరి క్రెడిటో కాదు అంటూ ఎన్టీఆర్ తన తాజా చిత్రం బృందావనం గురించి మీడియాతో చెప్పుకొచ్చారు. అలాగే విందుభోజనం లాంటి పాత్ర ఇందులో నా పాత్ర పేరు కృష్ణ. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్. ఒక యాక్టర్‌కి విందుభోజనం లాంటి పాత్ర. అన్ని రకాల ఎమోషన్స్, షేడ్స్ కలగలిపి ఉన్న పాత్ర. బాగా కష్టపడి చేశాను. 'బృందావనం'లో మెయిన్ హైలైట్ ఎన్టీఆర్ కొత్తగా కనిపించడం అన్నారు.

ఇక ప్రేక్షకుల కోసమే సినిమా నా కెరీర్‌లో హిట్లు, ఫ్లాపులు చూశా. ఇప్పుడు వాటికి అతీతమై పోయా. మనం హిట్టవుతాయనుకున్నవి హిట్లవ్వవు. ఫ్లాపవుతాయనకున్నవి కావు. మనం చేసేది ప్రేక్షకుల కోసమే. ఒకే ఫార్ములాకి పరిమితమవుతున్నామా అనే భావన మొదలైంది అన్నారు ఎన్టీఆర్ ఎంతో పరిణితిగా. నాకు 'బొమ్మరిల్లు', 'కొత్త బంగారులోకం' సినిమాలు బాగా ఇష్టం. కానీ అలాంటివి చేయాలనుకున్నా చేయలేను. మాస్‌ని వొదులుకోకుండానే కొత్తకోణంలో, కొత్తరకంగా చెయ్యాలని చేసిన సినిమా 'బృందావనం' అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu