»   » ఎన్టీఆర్ గుడి కోసం కిడ్నీలు అమ్మటానికి సిద్దపడి.... వీరాభిమానం అంటే ఇదేనా..!??

ఎన్టీఆర్ గుడి కోసం కిడ్నీలు అమ్మటానికి సిద్దపడి.... వీరాభిమానం అంటే ఇదేనా..!??

Posted By:
Subscribe to Filmibeat Telugu

జాతిని నడిపించే నాయకుడిని దేవుడిని చేయడం ఈ దేశపు ప్రాథమిక విశ్వాసాలకు మూల సూత్రం. దీనికి న్యూరో-సోషియో కాంప్లెక్స్ అని ఒకాయన నామకరణం చేశారు.ఒక దశలో విశ్వాసం, అభిమానం కూడా మైకమే. ప్రశంసించి, అభిమానించి, ఆరాధించి, ఆఖరికి దేవుడిని చేసి, ఆయన విగ్రహాన్ని ప్రతిష్ట చేసి సంతోషపడతాం. మన దేశంలో గుడులు బోలెడు. శంబల్‌పూర్‌లో గాంధీజీకి గుడి ఉంది. కర్ణాటకలో రజనీకాంత్‌కి గుడి ఉంది. తిరుచినాపల్లిలో కుష్బూకి గుడి ఉంది.

తిరునల్వేలిలో నమితాకి గుడి ఉంది. బుందేల్‌ఖండ్‌లో మాయావతికి గుడి ఉంది. దక్షిణ కలకత్తాలో అమితాబ్ బచ్చన్‌కి గుడి ఉంది. ఇందిరాగాంధీకి బోలెడు గుడులు ఉన్నాయి. తెలంగాణను ప్రసాదించినందుకు నాటి శాస నసభ్యులు శంకరరావుగారు సోనియాను తెలంగాణ దేవతగా అభివర్ణిస్తూ గుడి నిర్మించారు. మన దేశంలో సచిన్ టెండూల్కర్ దేవుడు. ఒక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి, తరతరాల జీవన ధోరణినే మార్చిన సర్ ఆర్థర్ కాటన్ దేవుడు. ఓట్లతో గెలిచిన రాజకీయ నాయకుడు దేవుడు.సాధారణంగా సినీ నటులకు అభిమానులు గుడులు కట్టించి పూజలు చేస్తుంటారు. ఈ కోవలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ, తెలుగు నటి ఖుష్బూకు అభిమానులు స్వయంగా ఆలయాలు నిర్మించి పూజలు చేశారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్ట్టించిన విషయం తెల్సిందే.

 సీనియ‌ర్ ఎన్‌టీఆర్:

సీనియ‌ర్ ఎన్‌టీఆర్:


అయితే ఇలా గుడులు కట్టటానికి కేవలం డబ్బులే ఉండాల్సిన పని లేదు. అభిమానం ఉండాలే కానీ ఏమైనా చేయొచ్చ‌ని నిరూపిస్తున్నాడు చిత్తూరుకు చెందిన సీనియ‌ర్ ఎన్‌టీఆర్ వీరాభిమాని ఒక‌రు. ఎన్‌టీఆర్‌కు విగ్ర‌హం ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా ఓ గుడిని కూడా ఈయ‌న నిర్మించారంటే.. ఆ వీరాభిమానాన్ని ఎంతని మ‌నం అంచ‌నా వేయ‌గ‌లం.

 జ‌యకు కట్టిన గుడిలో:

జ‌యకు కట్టిన గుడిలో:


వాస్త‌వానికి మ‌న తెలుగు రాష్ట్రాల్లో నేత‌ల‌కు గుడులు క‌ట్టేసంప్ర‌దాయం లేదు. త‌మిళ‌నాడులో మాత్ర‌మే సీఎం జ‌య స‌హా మాజీ సీఎం ఎంజీఆర్ వంటివారికి గుడులు ఉన్నాయి. జ‌యకు కట్టిన గుడిలో ఇప్ప‌టికీ పూజ‌లు పున‌స్కారాలు కూడా జ‌రుగుతున్నాయ‌ట‌.

వీరాభిమానానికి కొదవలేదు:

వీరాభిమానానికి కొదవలేదు:

తమిళనాడులో అభిమానులకు, వీరాభిమానానికి కొదవలేదు రజనీకాంత్ లాంటి సెలబ్రిటీలకేకాదు కుష్బూ, హన్సిక, నయనతారల్లాంటి కథానాయికలకు కూడా గుడులు కట్టించారు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌కు .... అలాగే నరేంద్రమోడీ, ములాయాం సింగ్ యాదవ్, లాలూప్రసాద్-రబ్రీదేవిలకు సైతం గుడులు కట్టించేందుకు అభిమానులు ముందుకు వస్తున్నారు.

 నేతలకు ఆలయాలు:

నేతలకు ఆలయాలు:


అయితే తెలంగాణలో కెసీఆర్‌కు గుడి కట్టించారు కొందరు ఔత్సాహికులు...ఇప్పుడు అమరావతి శంకుస్థాపనతోపాటుగా అక్కడే చంద్రబాబుకు కూడా కొందరు రైతులు ఓ గుడి కట్టించబోతున్నారు. దానికీ రాజధాని ముహూర్తమే ఖరారు చేశారు. అభిమానం హద్దులు దాటేస్తోంది...ఒకప్పుడు శిలా విగ్రహాలతో సరిపెట్టిన అభిమానులు ఏకంగా తమ అభిమాన నేతలకు ఆలయాలు కూడా కట్టేస్తున్నారు.

 పీ. శ్రీనివాసులు అనే వ్య‌క్తి:

పీ. శ్రీనివాసులు అనే వ్య‌క్తి:


చిత్తూరు ప్రాంతం త‌మిళ‌నాడుకు ప‌క్క‌నే ఉంటుంది కాబ‌ట్టి ఆ వాస‌న‌లు అంటుకున్నాయో ఏమో తెలీదు కానీ, చిత్తూరులోని పీ. శ్రీనివాసులు అనే వ్య‌క్తి సీనియ‌ర్ ఎన్‌టీఆర్‌కు పెద్ద ఎత్తున గుడి క‌ట్టించారు. అయితే, ఈయ‌న‌గారేమీ పెద్ద బిజినెస్ మ్యానో, ఇండ‌స్ట్రియ‌లిస్టో అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే. శ్రీనివాసులు ఓ వృద్ధుడు.

 వెల‌క‌ట్ట‌లేని వీరాభిమానం:

వెల‌క‌ట్ట‌లేని వీరాభిమానం:


ఈయ‌న‌కు ప్ర‌భుత్వం నెల‌నెలా అందించే వృద్ధాప్య పింఛ‌న్‌తోపాటు చిన్న‌పాటి బ‌డ్డీ కొట్టే ఆధారం. అయిన‌ప్ప‌టికీ.. మ‌నం పైన చెప్పుకొన్న‌ట్టు.. మ‌న‌సుండాలి.. టైపులో ఎన్‌టీఆర్‌పై ఈయ‌న‌కు వెల‌క‌ట్ట‌లేని వీరాభిమానం ఉంది. వివరాల్లోకి వెళితే....

 చిత్తూరు జిల్లా:

చిత్తూరు జిల్లా:


చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కంచెనపల్లికి చెందిన పెనుమచ్చ శ్రీనివాసులుది నిరుపేద కుటుంబం. 1985లో సంభవించిన పెను తుపానుకు అందరితోపాటు వారూ నిరాశ్రయులయ్యారు.

 ఆకలి తీర్చిన ఎన్టీఆర్ :

ఆకలి తీర్చిన ఎన్టీఆర్ :


అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఈ ప్రాంతాన్ని పరిశీలించి నిరాశ్రయులైన పేదలకు బట్టలు, బియ్యం, వంటపాత్రలు, వంట సరుకులు పంపిణీ చేశారు. తమ ఆకలి తీర్చిన ఎన్టీఆర్ వారికి ఆపద్బాంధవుడైనాడు.

 రామారావును దైవంగా:

రామారావును దైవంగా:


ఆనాటినుంచి రామారావుకు వీరాభిమానిగా మారాడు. రామారావును దైవంగా తలచి, ఆయనకో గుడి కట్టాలని నిర్ణయించుకుని, రోజూ కూలికెళ్లి సంపాదించిన మొత్తంలో కొంత కూడబెట్టి, ఇంకొంత అప్పు చేసి, చివరకు ఓ చిన్న గుడి కట్టాడు.

సమర్థ వంతమైన నాయకుడిగా:

సమర్థ వంతమైన నాయకుడిగా:

ఆంధ్రుల ఆరాధ్య దైవమైన అన్నగారు ఎన్టీఆర్‌ను అభిమానించని వారంటూ ఉండరు. వెండితెరపై నటనతో మాత్రమే కాదు...సమర్థ వంతమైన రాజకీయ నాయకుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 దశాబ్దాలు గడిచినా:

దశాబ్దాలు గడిచినా:


అందుకే ఆయన చనిపోయి దశాబ్దాలు గడిచినా ఆయనపై తరగని అభిమానం. ఆ అభిమానంతోనే ఈ వీరాభిమాని ఆయనకు గుడి కట్టడానికి సిద్ధమయ్యాడు. గుడి నిర్మాణానికి డబ్బు లేకపోవడంతో కిడ్నీలను సైతం అమ్మకానికి సిద్ధమయ్యాడు.

 నిత్య పూజలు:

నిత్య పూజలు:


ఓ దాత సహాయంతో చిన్న ఎన్టీఆర్ విగ్రహమూ సమకూర్చుకున్నాడు.గుడి కట్టటం అంటే ఏదో అలా నిర్మించి వదిలేయటం కాదు నిత్య పూజలు చేస్తున్నాడు. ఈ గుడికి మరికొంతమంది ఎన్టీఆర్ ఆభిమానులు వచ్చి వెళ్తూ ఉంటారు.

 ఆర్థికంగా సాయం:

ఆర్థికంగా సాయం:


అయితే, ఆయ‌న‌కు ఇక్క‌డే ఆర్థిక స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ట‌. నిత్యం పూజ‌లు చేయాలంటే రోజూ ఖ‌ర్చుతో ప‌ని ఉంద‌ని, ఆర్థికంగా త‌న‌కు అంత స్తోమ‌త లేద‌ని త‌న స‌న్నిహితుల వ‌ద్ద శ్రీనివాసులు వాపోతున్నాడ‌ట‌. సో.. ఆయ‌న‌కు ఎవ‌రైనా ఆర్థికంగా సాయం చేస్తే.. త‌న కోరిక తీరుతుంద‌న్న‌మాట‌. మ‌రి ఎవ‌రైనా దాత‌లు శ్రీనివాసులు కోరిక‌ను తీరుస్తారో లేదో చూడాలి.

 మరికొందరు సెలబ్రిటీలకు:

మరికొందరు సెలబ్రిటీలకు:


అయితే మన నందమూరి తారక రాముడికే కాదు మరికొందరు సెలబ్రిటీలకు గుడి కట్టే ఆలోచన దేశం లో మరికొన్ని ప్రదేశాలకూ విస్తరించింది. అంచెలంచెలుగా చాయ్ వాలానుంచి ప్రధానిగా ఎదిగిన నరేంద్రమోడీ గుజరాత్‌లో ఆయన వీరాభిమానులు ఓ అడుగు ముందుకు వేసి నరేంద్రుడికి ఆలయం కట్టించారు. అంతేకాదు మోడీని ఆయన ఆలయావిష్కరణకు రావలసిందిగా పిలుపును కూడా ఇవ్వడం గమనార్హం.

 సాంప్రదాయం కాదని:

సాంప్రదాయం కాదని:


అయితే ఇదంతా చూసి నరేంద్రమోడీ తీవ్రంగా కలతచెందారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో తన విగ్రహాన్ని ప్రతిష్టించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. తన లాంటి మనుషులకు గుడి కట్టడం సాంప్రదాయం కాదని తెలిపారు. . తనకు ఆలయం నిర్మించడం వ్యక్తిగతంగా చాలా బాధించిందని అన్నారు. ఇటువంటివి మళ్లీ పునరావృతం చేయరాదంటూ ఆయన సూచించారు.

 పవన్ కళ్యాణ్ కీ గుడి :

పవన్ కళ్యాణ్ కీ గుడి :


పవన్ నామస్మరణతో పులకరించిపోతున్న కొంతమంది పవన్ వీరాభిమానులు చేస్తున్న సాహసం ఇప్పుడు మీడియాకు సంచలన వార్తగా మారింది.
ఏకంగా పవన్ కళ్యాణ్ కీ గుడి కట్టే ప్రయత్నమూ మొదలయ్యిందట.

 2 లక్షల ఖర్చుతో:

2 లక్షల ఖర్చుతో:


అయితే దాదాపు 2 లక్షల ఖర్చుతో పవన్ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని తాడేపల్లిగూడెంకు చెందిన డాక్టర్ అరుణ్ ప్రసాద్ అనే పవన్ వీరాభిమాని నిర్మిస్తూ ఉంటే ప్రముఖ శిల్పికరుణాకర్ ఉడియార్ రూపకల్పన చేశారు అని తెలుస్తోంది.

English summary
Penumacha Srinivasulu from Tottembedu, Chittoor district is the hardcore fan who had started to build the temple, he had even got a statue of NTR to keep in the temple. But the construction was stopped midway due to lack of funds which forced the fan to put his kidneys on sale
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu