»   »  విష్ణు సందర్భంగా...జూ ఎన్టీఆర్ కోసం మోహన్ లాల్ గిఫ్టు!

విష్ణు సందర్భంగా...జూ ఎన్టీఆర్ కోసం మోహన్ లాల్ గిఫ్టు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విష్ణు సందర్భంగా ఎన్టీఆర్ కోసం మోహన్ లాల్ గిఫ్ట్ ఏమిటి? అని ఆశ్చర్యపోతున్నారా? తెలుగు వారు నూతన సంవత్సర ప్రారంభ వేడుకలను 'ఉగాది' పేరుతో జరుపుకుంటారు. అలాగే మళయాలీలు నూతన సంవత్సర ప్రారంభ వేడుకలు 'విష్ణు' పేరుతో జరుపుకుంటారు... అదీసంగతి.

ఏప్రిల్ 14న మలయాళీల నూతన సంవత్సరాది కావడంతో, ఆ సందర్భంగా కేరళలో మాత్రమే ప్రత్యేకంగా తయారుచేసే ఒక రకమైన స్వీట్ తో పాటు .. ఒక వెండి కృష్ణుడి విగ్రహాన్ని ఎన్టీఆర్ కి మోహన్ లాల్ కానుకగా ఇచ్చారట.

'జనతా గ్యారేజ్' సినిమాలో కలసి నటిస్తున్న ఎన్టీఆర్, మోహన్ లాల్ చాలా క్లోజ్ అయ్యారు. అందుకే తమ పండగరోజు ఎన్టీఆర్ కు ఏదైనా గిఫ్టు ఇవ్వాలనుకున్నారు మోహన్ లాల్. అందుకే మళయాల సాంప్రదాయం ప్రకారం ప్రత్యేకమైన స్వీటు, కృష్ణుడి విగ్రహం బహుమతిగా అందించాడు.

జనతా గ్యారేజ్ సినిమా విషయానికొస్తే.... మైత్రీమూవీమేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రత్యేకంగా వేసిన గ్యారేజ్ సెట్లో షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు కొరటాల శివ ఇప్పటి వరకు దర్శకుడిగా రెండు సినిమాలు చేసారు. రెండు సినిమాల్లోనూ హీరోలను డిఫరెంట్ స్టైల్‌లో చూపించారు. ముఖ్యంగా హీరో లుక్, యాటిట్యూడ్ విషయంలో కొరటాల చాలా కేర్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ ను డిఫరెంటుగా చూపించబోతున్నారు.

స్లైడ్ షోలో జనతాగ్యారేజ్ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోస్...

లొకేషన్ స్టిల్

లొకేషన్ స్టిల్


జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించిన లొకేషన్ స్టిల్.

జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్


ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సెట్ ఇదే...

ఎన్టీఆర్

ఎన్టీఆర్


దర్శకుడు కొరటాల శివ, మళయాల నటుడు మోహన్ లాల్ తో కలిసి ఎన్టీఆర్.

సెల్ఫీ

సెల్ఫీ


ఎన్టీఆర్, మోహన్ లాల్, కొరటాల, బ్రహ్మాజీ సెల్ఫీ...

ఎన్టీఆర్

ఎన్టీఆర్


ఈ చిత్రంలో ఎన్టీఆర్ మాస్ లుక్ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.

English summary
Malayalam Superstar Mohanlal is said to have surprised Jr.NTR with a special gift on the occasion of Vishu. The actor apparently gave NTR, a beautifully sculpted silver idol of Krishna, besides treating him with Kerala's special sweets and dishes. 'In fact, the set looked like a celebration yesterday', said a source close to the team. It is known that NTR and Mohanlal teamed up with director Koratala Siva, for the project Janatha Garage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu