»   » అఫీషియల్ : అక్టోబర్ 2న...ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్

అఫీషియల్ : అక్టోబర్ 2న...ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అక్టోబర్ 2 న గాంధీ జయింతి సందర్బంగా ఎన్టీఆర్ చేతుల మీదుగా...కుమారి 21 ఎఫ్ ఆడియోని విడుదల చేయటానికి నిర్ణయం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటన చేసారు. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఎన్టీఆర్..అదే సుకుమార్ ప్రొడక్షన్ లో రెడీ అవుతున్న చిత్రం కావటంతో ఈ ట్రైలర్ లాంచ్ కు ఛీఫ్ గెస్ట్ గా కమిటయ్యినట్లు సమాచారం.

సుకుమార్‌కు తొలిసారి నిర్మాతగా మారి ఓ విలక్షణ కథతో కుమారి 21 ఎఫ్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత కాకుండా ఆయన కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ సమర్పణలో విజయ్‌కుమార్ బండ్రెడ్డి, థామస్‌రెడ్డి ఆదూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


NTR to launch Kumari 21F trailer on October 2nd

సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకుడు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తుండటం విశేషం. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ ఇదొక విభిన్నమైన ప్రేమకథ. దేవీశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫొటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. రాజ్‌తరుణ్ పాత్ర, అభినయం అందర్ని ఆకట్టుకుంటుంది అన్నారు.


నిర్మాతలు మాట్లాడుతూ సుకుమార్ భాగస్వామ్యంలో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న చిత్రమిది. సుకుమార్ మార్క్‌లో సాగే ఈ ప్రేమకథాచిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభిస్తోంది. త్వరలో టీజర్‌ను, అక్టోబర్ 30న చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. నోయల్, నవీన్, సుదర్శన్‌రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగి బ్రదర్స్, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు.


ఈ చిత్రానికి కెమెరా:ఆర్.రత్నవేలు,ప్రొడక్షన్ డిజైనర్:ఎస్.రవీందర్,ఎడిటింగ్:కార్తిక శ్రీనివాస్, పాటలు:చంద్రబోస్, మాటలు:పొట్లూరి వెంకటేశ్వరరావు, ఫైట్స్:డ్రాగన్ ప్రకాష్, డ్యాన్స్:ప్రేమ్క్ష్రిత్, సహనిర్మాతలు:ఎం.రాజా, ఎస్.రవికుమార్.

English summary
The trailer of director Sukumar's first production, Kumari 21F, will be launched on 2nd October in Hyderabad. NTR who is currently doing Nannaku Prematho under the direction of Sukumar has agreed to grace the event as the chief guest and unveil the trailer on the stage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu