»   » అజ్ఞాతవాసి ఎఫెక్ట్‌తో ఆ గాసిప్ నిజమైంది.. త్రివిక్రమ్‌కు ఆ హీరోయిన్ షాక్

అజ్ఞాతవాసి ఎఫెక్ట్‌తో ఆ గాసిప్ నిజమైంది.. త్రివిక్రమ్‌కు ఆ హీరోయిన్ షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu
NTR Trivikram Movie New Twist గాసిప్ నిజమైంది, త్రివిక్రమ్ ఆఫర్ కి నో !

అజ్ఞాతవాసి చేదు అనుభవం తర్వాత యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ సినిమాను పట్టాలెక్కించేందుకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో డీజేలో బికినీ అందాలతో అదరగొట్టిన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నది. అయితే అజ్ఞాతవాసికి సంగీత దర్శకత్వం వహించిన అనిరుధ్ రవిచందర్‌ను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తారనే గాసిప్ వార్త నిజమవ్వడం గమనార్హం.

 అనిరుధ్ రవిచంద్రన్ అవుట్

అనిరుధ్ రవిచంద్రన్ అవుట్

ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ప్రారంభోత్సవానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ హాజరయ్యారు. అయితే అధికారికంగా వెల్లడికాకపోయినా ఆ చిత్రానికి ఆయనే సంగీత దర్శకుడు అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అజ్ఞాతవాసి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఆయనను తొలగిస్తారనే వార్తలు ఊపందుకొన్నాయి.

 ఎస్ఎస్ థమన్‌కు బంపర్ ఆఫర్

ఎస్ఎస్ థమన్‌కు బంపర్ ఆఫర్

అందరూ ఊహించినట్టే త్రివిక్రమ్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌ నుంచి అనిరుధ్ వెళ్లిపోయి ఎస్ఎస్ థమన్ వచ్చేశాడు. ఈ విషయాన్ని థమన్ అధికారికంగా ప్రకటించాడు. తాను త్రివిక్రమ్ సినిమాకు సంగీతం అందిస్తున్నట్టు ట్వీట్ చేశాడు.

ఎన్నో ఏళ్ల కల నిజమైంది..

ఎన్నో ఏళ్ల కల నిజమైంది..

ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. నా కల వాస్తవ రూపం దాల్చింది. అందుకు కారణం, హారిక, హాసిని క్రియేషన్స్, త్రివిక్రమ్ సర్.. తారక్. వారిపై నాకు అమితమైన గౌరవం, ప్రేమ ఉంది. భగవంతుడు చల్లగా చూడాలని కోరుకొంటున్నాను అని థమన్ ట్వీట్ చేశాడు.

 త్రివిక్రమ్‌కు హీరోయిన్ షాక్

త్రివిక్రమ్‌కు హీరోయిన్ షాక్

అత్తారింటికి దారేది సినిమా నుంచి నదియా, ఖుష్బూ లాంటి సీనియర్ నటులను త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చిత్రం కోసం కూడా ఒకప్పటి హీరోయిన్ లయను త్రివిక్రమ్ సంప్రదించారట. అందుకు త్రివిక్రమ్ ఆఫర్‌ను లయ తిరస్కరించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

ఎందుకు తిరస్కరించిందో..

ఎందుకు తిరస్కరించిందో..

పదేళ్ల క్రితం లయ టాలీవుడ్‌లో ఓ మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్నది. కెరీర్‌పరంగా బిజీగా ఉండగానే పెళ్లి చేసుకొని వ్యక్తిగత జీవితంలో బిజీగా మారింది. ప్రస్తుతం తల్లిగా తమ పిల్లలకు అందుబాటులో ఉంటున్నారు. త్రివిక్రమ్ ఆఫర్ అంటే ఎవరైనా ముందు, వెనుకా ఆలోచించకుండా ఒకే చెప్తారు. కానీ లయ ఎందుకు ఆయన ఆఫర్‌ను తిరస్కరించిందో అర్థం కావడం లేదని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

English summary
Junior NTR and Trivikram Srinivas's latest project set to start shooting for their upcoming movie soon. SS Thaman replaces Anirudh Ravichander to score music for this movie. Latest news goed viral in news that, Trivikram Srinivas offered a vital role to actress Laya, which she rejected to accept. Laya was one of the top heroines a decade ago.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu