»   » బ్లాక్ మనీ చుట్టు తిరుగుతుంది: ఎన్టీఆర్ చూడమంటూ ట్వీట్..అంతా ఆశ్చర్యపోతున్నారు

బ్లాక్ మనీ చుట్టు తిరుగుతుంది: ఎన్టీఆర్ చూడమంటూ ట్వీట్..అంతా ఆశ్చర్యపోతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బ్లాక్ మనీ చుట్టూ తిరిగే కథతో కమాండో 2 అనే చిత్రం వస్తోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఇక్కడ కూడా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం చూడమంటూ ఎన్టీఆర్ రికమండ్ చేస్తూ ఓ ట్వీట్ చేసి అందరి దృష్టిలో ఈ సినిమా పడేలా చేసారు. అంతేకాదు ఆ చిత్రం ట్రైలర్ ని కూడా యాడ్ చేసారు.

సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా కనిపించడు ఎన్టీఆర్. దాంతో ఆయన సోషల్ మీడియా పేజ్ లో ఇంట్రస్టింగ్ ట్వీట్ ఒకటి దర్శనమివ్వటంతో అంతటా హాట్ టాపిగ్ గా మారింది. పెద్దగా ఇతర హీరోల సినిమాల గురించి ట్వీట్ చేయని ఎన్టీఆర్ ఈ మధ్య బాబాయ్ హీరోగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి టీంకు శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ ఇప్పుడు ఓ బాలీవుడ్ హీరో సినిమాకు విషెస్ చెప్పి ఆశ్చర్యపరిచారు.

NTR Tweeted about Vidyut Jamwal for Commando 2

సౌత్ లో విలన్ గా సోపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన విద్యుత్ జమాల్ బాలీవుడ్ లో హీరోగా తెరకెక్కిన సినిమా కమాండో. ఈ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న కమాండో 2 తెలుగులో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఎన్టీఆర్ జమాల్ కు విషెస్ చెప్పాడు. 'నా ప్రియమైన స్నేహితుడు విద్యుత్ జమాల్ హీరోగా తెరకెక్కిన కమాండో 2 తెలుగులో వస్తోంది.అతడికి ఆల్ ద బెస్ట్' అని ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన శక్తి, ఊసరవెల్లి సినిమాల్లో జమాల్ కీలక పాత్రల్లో నటించినప్పుడు వీళ్లిద్దరి మధ్యా స్నేహం కలిసింది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని రికమెండ్ చేసారు.

శ‌క్తి, ఊస‌ర‌వెల్లి. ఈ రెండు సినిమాలూ ఫ్లాప‌వ‌డంతో జ‌నాల‌కు అత‌ను పెద్ద‌గా గుర్తు లేకుండా పోయాడు. అయితే ఎన్టీఆర్‌కు మాత్రం అత‌డితో మంచి అనుబంధం ఉంద‌ని ఈ ట్వీట్‌తో అర్థ‌మైంది. తెలుగులో చేసిన సినిమాలు ఆడ‌క‌పోయినా.. త‌మిళంలో మురుగదాస్ మూవీ 'తుపాకి'లో మెయిన్ విలన్ పాత్రలో కనిపించి మంచి పేరు సంపాదించాడు విద్యుత్‌.

అలాగే..బాలీవుడ్లో మూడేళ్ల కింద‌ట అత‌ను చేసిన 'కమాండో' ప‌ర్వాలేద‌నిపించింది. దానికి కొన‌సాగింపుగా ఇప్పుడు క‌మాండో-2 చేశాడు. 'హార్ట్ అటాక్' భామ ఆదా శర్మ ఇందులో హీరోయిన్ గా నటించడం విశేషం. బ్లాక్ మనీ గుట్టు రట్టు చేసేకమాండో కథ ఇది.

English summary
Young tiger NTR has tweeted praising Commando 2 trailer.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu