జూ ఎన్టీఆర్ చిన్న కుమారుడికి పేరు పెట్టారోచ్.... ఏమిటో తెలుసా?
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి దంపతులు జూన్ 14న రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన ఎన్టీఆర్ ఇద్దరు కొడుకులతో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఇన్‌స్టాలో మరో పోస్టు చేశారు. ఈ పోస్టు ద్వారా తన చిన్న కుమారుడి పేరు అభిమానులకు వెల్లడించారు.

చిన్నోడు భార్గవరామ్
తన రెండో కుమారుడికి భార్గవరామ్ అనే పేరు పెట్టినట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా తన ఫ్యామిలీ ఫోటోను ఎన్టీఆర్ అభిమానులకు షేర్ చేశారు. చిన్నోడికి పేరు పెట్టే కార్యక్రమాన్ని వేడుక నిర్వహించారని సమాచారం.

తమ్ముడితో అభయ్ రామ్
ఇంతకు ముందు ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ ఫోటోలో తమ్ముడు భార్గవరామ్‌ను అభయ్ రామ్ ఎత్తుకుని ఉండగా..... ఎన్టీఆర్ ఆ ఇద్దరి ఫోటోను తన సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్నట్లు ఉంది.

ఇద్దరు వారసులతో ఎన్టీఆర్
కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతున్నారు. షూటింగ్ లేని సమయంలో తన ఇద్దరు వారసులతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ మూవీ
ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీరరాఘవ' అనే సినిమా చేస్తున్నారు. పూజా హెడ్గే హీరోయిన్. ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈచిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో పాత్ర కోసం ఎన్టీఆర్ భారీగా బురువు తగ్గి స్లిమ్ లుక్‌లోకి మారిపోయాడు.


Click it and Unblock the Notifications











