twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ నటుడు నూతన ప్రసాద్ మృతి

    By Srikanya
    |

    ప్రముఖ సినీ నటుడు నూతన ప్రసాద్ ఈ రోజు(30, మార్చి 2011) ఉదయం అపోలో హాస్పటల్ లో మృతి చెందారు.ఆయన గత కొంత కాలంగా అస్వస్ధతో చికిత్స పొందుతున్నారు.నూటొక్క జిల్లాల అందగాడు గా ఫేమస్ అయిన నూతన ప్రసాద్ కెరీర్ అక్కినేని.. అందాల రాముడు(1973) చిత్రంతో మొదలైంది. ఆ తర్వాత ఆయన నీడలేని ఆడది వంటి చిత్రాలు చేసినా బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు చిత్రంతో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. నెగిటివ్ పాత్రలను తనదైన శైలిలో పండిస్తూ ఒకానొక స్టేజిలో నూతన ప్రసాద్ లేనిదే తెలుగు సినిమా లేదు అన్న స్ధితికి చేరుకున్నారు. ఆయన డైలాగ్ డెలవరి కామిక్ టచ్ తో విలనిజానకి కొత్త అర్దం చెప్తూ సాగింది.

    ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ, చిరంజీవి వంటి పెద్ద పెద్ద హీరోలందరితో చేసిన నూతన ప్రసాద్ కామిడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు అన్న తేడా లేకుండా అన్ని పాత్రలకూ న్యాయం చేస్తూ వచ్చారు.ఇక రాజాధిరాజు చిత్రంలో ఆయన కొత్త దేముడండి అనే పాటతో పీక్ స్దాయికి వెళ్ళారు.దేశం చాలా క్లిష్ట పరిస్ధితుల్లో ఉంది అంటూ పట్నం వచ్చిన పతివ్రతల్లో ఆయన చెప్పిన డైలాగు ఇప్పటికీ ఓ తరం తెలుగు వారందరికీ పరిచయమే. 1989 లో బామ్మ మాట బంగారు బాట చిత్రం సమయంలో ఆయనకు యాక్సిడెంట్ అయి కెరీర్,శరీరం కుంటుపడినా తన మనోబలంతో జయించి నటనలో కంటిన్యూ అయ్యారు. ఈ టీవీ వారి నేరాలు- ఘోరాలు లో ఆయన చెప్పే వాయిస్ కూడా అద్బుతంగా పేలింది. ఇలా తనకంటూ తెలుగువారి గుండెల్లో స్ధానం ఏర్పడుచుకున్న నూతన ప్రసాద్ మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాక తెలుగు వారందిరీ తీర్చేలేని లోటే. ఆయన మరణానికి ధట్స్ తెలుగు సంతాపం తెలియచేస్తోంది.

    English summary
    After long film and tv career Nutan Prasad just passed away today few hours back. It’s 30 March 2011 and according to your latest news, Nutan Prasad is no more.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X