»   » వివాద ఫలితం : ‘బలుపు’ సీన్ లేపాసారు

వివాద ఫలితం : ‘బలుపు’ సీన్ లేపాసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : . 'మొగుడిలా ఉన్నావంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి. పిండాలు పెట్టేస్తున్నారు' అంటూ సురేఖ వాణి చెప్పిన డైలాగ్ తాజాగా బ్రాహ్మణుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఆ డైలాగ్ తమను టార్గెట్ చేసే విధంగా ఉందని బ్రాహ్మణులు రీజనల్ సెన్సార్‌బోర్డు కు ఫిర్యాదు చేసారు. దాంతో అసలా సన్నివేశాన్నే నిర్మాత సినిమానుంచి తొలిగించామని రీజనల్ సెన్సార్‌బోర్డు కు లెటర్ పంపినట్లు సమాచారం.


రవితేజ నటించిన 'బలుపు' చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే అందులోని కొన్ని సీన్లు, డైలాగులు మాత్రం బ్రాహ్మణ సంఘాల ఆగ్రహానికి గురవుతున్నాయి. గతంలో బ్రాహ్మణులు చేసిన ఆందోళనపై సెటైరిక్‌గా కొన్ని సీన్లు పెట్టారు
గతంలో 'దేనికైనా రెడీ' చిత్రంలో నటి సురేఖ నటించిన సీన్లు వివాదాస్పదం అయ్యాయి. తాజాగా 'బలుపు' చిత్రంలో కూడా ఆమె చెప్పిన డైలాగులే వివాదాస్పదం కావడం గమనార్హం.

'దేనికైనా రెడీ' చిత్రంలో సురేఖ బ్రాహ్మణ ఇల్లాలుగా నటించింది. అందులో ఆమె పాత్ర అభ్యంతరకరంగా ఉందని, మరికొన్ని సీన్లు కూడా తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని అప్పట్లో బ్రాహ్మణ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేసాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ చిత్ర నిర్మాత మోహన్ బాబు కుటుంబానికి, బ్రాహ్మణ సంఘాలకు మధ్య ఓ చిన్నపాటి యుద్దమే జరిగింది. మోహన్ బాబుకు కొందరు బ్రాహ్మణులు పిండప్రధానం చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

English summary
Balupu might just have to go through a dialogue edit or maybe a scene cut too. This, after the recent controversy, which had The AP Brahmana Seva Sanga Samakhya alleging that the makers of the Ravi Teja-starrer has included a scene to hurt their sentiments.The makers showed the movie to a representative of the irked community. However, according to a source, the producer of the film has already sent a letter to Regional Censor Board Officer stating that he is going to delete the entire scene from the film to avoid controversies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu