Just In
- 14 min ago
KRACK వివాదం.. దిల్ రాజు గురించి మాట్లాడే అర్హతే లేదు.. బెల్లంకొండ సురేష్ కామెంట్స్
- 1 hr ago
క్రాక్ ఓటీటీ రిలీక్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతోందంటే?
- 1 hr ago
ఇన్నేళ్లకు ఆ విషయం తెలిసింది.. ఇకపై నేనేంటో చూపిస్తా.. రామ్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
సలార్ సినిమాకు హీరోయిన్ టెన్షన్.. వాళ్ళు ఖాళీగా లేరట
Don't Miss!
- News
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం
- Sports
యువరాజ్ సింగ్ పంచుకున్న భరతనాట్యం బౌలింగ్.. చూస్తే వావ్ అనాల్సిందే!వీడియో
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ పని పూర్తవగానే అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ తో ‘ఖలేజా’
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, అనుష్క జంటగా నటించిన 'ఖలేజా" చిత్రం అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శింగనమల రమేష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ మహేష్ బాబు మాత్రం తన పాత్రకు ఇంకా డబ్బింగ్ పూర్తి చేయాల్సి ఉందని తెలిసింది. అయితే మహేష్ గొంతు ఇన్ ఫెక్షన్ తో బాధపడుతుండటంతో డబ్బింగ్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడట. కానీ మహేష్ ఏదో విధంగా రేపటిలోగా తన పాత్రకు డబ్బింగ్ కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడట. ఇక మహేష్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం పూర్తయిపోతే 'ఖలేజా" చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయినట్టేననీ తెలుస్తోంది. సో అక్టోబర్ 3న ఫస్ట్ కాపీ సిద్దం చేసుకొని అక్టోబర్ 4వ తేదీన సెన్సార్ కార్యక్రమాలు పెట్టుకోవాలనీ నిర్మాత భావిస్తున్నట్టు సమాచారమ్.
సో మహేష్ రేపటిలోగా డబ్బింగ్ పూర్తి చేసేస్తాడని అభిమానుల మనసు కుదుటపడేలా..ప్రేక్షకుల సంశయాలన్నీ సమసిపోయేలా 'ఖలేజా" రిలీజ్ డేట్ కి సంబంధించిన అఫిషియల్ స్టేట్ మెంట్ వచ్చేసింది. అక్టోబర్ 7న 'ఖలేజా" విడుదల అంటూ రేపట్నుంచీ అన్ని ప్రముఖ దిన పత్రికలలోనూ ప్రకటనలు వెలువడనున్నాయి. ప్రిన్స్ మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా హయ్యస్ట్ ప్రింట్స్ తో..హయ్యస్ట్ థియేటర్స్ లో 'ఖలేజా" రిలీజ్ కి రంగం సిద్దం చేస్తున్నారు నిర్మాతలు శింగనమల రమేష్ బాబు అండ్ సి కళ్యాణ్.