»   » వర్మ బాలీవుడ్ ‘సీక్రెట్‌’ రివిలైంది ...ఇదిగో

వర్మ బాలీవుడ్ ‘సీక్రెట్‌’ రివిలైంది ...ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్‌కు గత ఏడాదిన్నరగా దూరంగా ఉన్నారు. ‘సత్య 2′ తర్వాత రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ ఎంట్రీకి తాను ఇంతవరకూ తీయని జానర్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా ‘సీక్రెట్' పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఈ రోజు ఆయన విడుదల చేసారు. ఆ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

"ప్రతీ పెళ్ళైన మగాడి సెల్‌ఫోన్‌లో భార్యకు తెలియని ఓ రహస్య జీవితం ఉంటుంది" అంటూ సీక్రెట్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సచిన్ జోషి, మీరా చోప్రాలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో జెడ్ 3 ప్రొడక్షన్స్ నిర్మించింది. పెళ్ళైన ఓ వ్యక్తి మరో అమ్మాయితో సంబంధాన్ని పెట్టుకోవడం, ఆ తర్వాత అతడి జీవితంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో ఈ సినిమా ‘మొగలి పువ్వు' పేరుతో విడుదల కానుంది.

క్రైమ్, హర్రర్, డ్రామా, థ్రిల్లర్ ఇలా రకరకాల జానర్లలో సినిమాలు తీసిన వర్మ, తాజాగా రొమాన్స్ జానర్లో ‘365డేస్' పేరుతో ప్రేమ, పెళ్ళి మధ్య నడిచే ఓ డిఫరెంట్ కథను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇదే పెళ్ళి, భార్యా భర్తల బంధం, అక్రమ సంబంధాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ‘మొగలి పువ్వు' పేరుతో ఓ సినిమా తెరకెక్కించడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

Official poster of RGV’s new film ‘Secret’ released

"ప్రతీ పెళ్ళైన మగాడి సెల్‌ఫోన్‌లో భార్యకు తెలియని ఓ రహస్య జీవితం ఉంటుంది" అంటూ విడుదలైన ‘మొగలి పువ్వు' సినిమా ట్రైలర్‌లో రామ్ గోపాల్ వర్మ మార్క్ థ్రిల్లర్ సన్నివేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సచిన్ జోషి, మీరా చోప్రాలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో జెడ్ 3 ప్రొడక్షన్స్ నిర్మించింది. పెళ్ళైన ఓ వ్యక్తి మరో అమ్మాయితో సంబంధాన్ని పెట్టుకోవడం, ఆ తర్వాత అతడి జీవితంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. గత కొంతకాలంగా సరైన హిట్‌లేని వర్మ మరి ఈ సినిమా ద్వారా అభిమానులను థ్రిల్ చేస్తాడా? అన్నది వేచి చూడాలి.

English summary
Ram Gopal Varma today unveiled the first poster of 'Secret', his first Bollywood film after a gap of almost two years.
Please Wait while comments are loading...