twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఓ మై ఫ్రెండ్‌’ కాపీ కథ కాదంటూ...

    By Srikanya
    |

    తెలుగులో స్నేహంపై చాలా తక్కువ చిత్రాలు వచ్చాయి. వాటిలో 'ఇద్దరుమిత్రులు"తో ఈ సినిమాని పోల్చారు. అయితే ఇదేం కాపీ కథ కాదు. స్నేహంపై సినిమాలు వచ్చినప్పుడు కొన్ని పోలికలుండొచ్చు. సిరి లాంటి ఫ్రెండ్‌ నిజంగానే ఉంది. నా జీవిత కథనే సినిమాగా తెరకెక్కించాను"" అన్నారు వేణు శ్రీరామ్‌. ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'ఓ మై ఫ్రెండ్‌". సిద్ధార్థ్‌,శృతిహాసన్‌ ,హన్సిక, నవదీప్‌ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఇలా స్పందించారు. అలాగే 'నా నిజజీవితంలో సంఘటనల నుంచి పుట్టిన సినిమా ఇది. కథనం కోసం స్నేహితులు చైతన్య దంతులూరి, కొరటాల శివ, బాబిల సహాయం తీసుకున్నా. ఏదేమైనా 'బొమ్మరిల్లు" స్థాయిలో ఉంటుందన్న అంచనాలు చేరకపోయినా.. నెమ్మదిగా జనాల్లోకి వెళుతున్నందుకు సంతోషంగా ఉంది. వెంకటేశ్వర బేనర్‌లోనే సినిమా చేస్తున్నా"" అని వివరించారు.

    అలాగే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నా సినిమా చూసి చాలా బావుందని కాంప్లిమెంట్‌ ఇచ్చారు. స్నేహంలోని స్వచ్ఛతను అద్దం పట్టే సినిమా చేశావని అన్నారాయన అని వేణు చెప్పారు.ఇక కథ రాసేప్పుడే హీరో సిద్ధార్థ అనుకున్నా. తన శరీరభాషకు తగ్గట్టే పాత్ర రూపొందింది. అలాగే కథానాయికల కోసం వెతకడానికి చాలా సమయం తీసుకున్నాం. ఎంతో మందికి కథ చెప్పాం. చివరికి శృతి, హన్సికలు కుదిరారు. మా చిత్రానికి సంగీతం పెద్ద అస్సెట్‌. రాహుల్‌రాజ్‌ బాణీలు, మణిశర్మ నేపథ్య సంగీతం బాగా ఆకట్టుకున్నాయి. విజయ్‌.కె.చక్రవర్తి ఛాయాగ్రహణం కూడా ప్రధాన ఆకర్షణ అయింది అని వివరించారు.

    English summary
    Siddharth's new film Oh My friend released three weeks ago with average talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X