For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ఓ మై ఫ్రెండ్‌' విడుదల దేదీ ఖరారు

By Srikanya
|

సిద్దార్ద హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ఓ మై ప్రెండ్ చిత్రం 11.11.11న ఉదయం 11గంటలకు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సిద్ధార్థ్‌, శృతిహాసన్‌, హన్సిక, నవదీప్‌ ముఖ్య తారాగణంలో వస్తున్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్‌'. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ అధినేతలు దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌లు నిర్మిస్తున్నారు. వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో ఈ ప్రేమకథా చిత్రం నిర్మిస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలకు పేరొందిన ఈ సంస్థ నుండి వస్తోన్న మరో కలర్‌ ఫుల్‌, ఫీల్‌గుడ్‌ మూవీ. ప్రస్తుతం పూనాలో ఈ సినిమా చివరి పాట చిత్రీకరణ జరుగుతోంది. నవంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ...'ఓ మై ఫ్రెండ్‌' సినిమా సక్సెస్‌ను ఈ చిత్రం విడుదలకు ముందు నుండే మా టీమ్‌ ఆస్వాదిస్తోంది. ఇటీవలే ఆడియో సూపర్‌హిట్‌ కావటమే ఇందుకు కారణం. శ్రోతల నుంచి ఆదరణ లభించింది. సంగీత దర్శకుడు రాహుల్‌రాజ్‌ పెద్ద పెద్ద సంస్థల్లో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం చిత్రంలోని చివరి పాటను పూనాలో చిత్రీకరిస్తున్నాం. విడుదల చేస్తున్నా'మని అన్నారు.

ఈ నెలాఖరున ఈ చిత్రం ఆడియో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రం టైటిల్ ట్రాక్ ని ఎఫ్ ఎమ్ రేడియోలో ఫర్మల్ గా అక్టోబర్ ఎనిమిదవ తేదిన విడుదల చేసారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ...ఈ చిత్రంలో ఐదు పాటలు, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. చాలా వరకూ నా చిత్రాలు అన్నీ మ్యూజికల్ హిట్సే.అలాగే ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యి ఛార్ట్ బస్టర్ లో టాప్ గా ఉంటాయని ష్యూర్ గా చెప్పగలను. మా దర్శకుడు వేణు శ్రీరామ్ మంచి ట్యూన్స్ ని సంగీత దర్శకుడు రాహుల్ రాజ్ నుంచి తీసుకున్నారు అన్నారు. ఇక దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ...నేను అతని పాటలను వెబ్ లో విని ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ చేసాను.సిద్దార్ధ,శృతి హాసన్ ఈ కథకు ఎస్సెట్ అన్నారు.

ఇక సిద్ధార్థ్, శ్రుతిహాసన్, హన్సిక, నవదీప్ కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్, లక్ష్మణ్ నిర్మిస్తున్న చిత్రం 'ఓ మై ఫ్రెండ్'. ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నది. నేడు యువతలో ఉన్న కన్‌ఫ్యూజన్స్, ఆలోచనలు, భవిష్యత్ ప్రణాళికలన్నీ కలగలిపి వేణు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 'బొమ్మరిల్లు' తర్వాత మా సంస్థలో సిద్ధార్థ్ నటిస్తున్న సినిమా ఇది. అతను మంచి నటుడనే సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంలో ఎక్కువ భాగం శ్రుతిహాసన్ కొట్టేస్తుంది అంటున్నారు దిల్ రాజు. దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ "ఇలాంటి సినిమా దిల్ రాజుగారు మాత్రమే తియ్యగలరు. స్వతహాగా మంచి ఆర్టిస్టు అయిన సిద్ధార్థ్ ఎంతో ఎఫర్ట్‌పెట్టి నటించాడు. శ్రుతి ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. ఆమెలో ఓ కొత్తకోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు'' అని చెప్పారు. అలీ, తనికెళ్ల భరణి, రఘుబాబు, లక్ష్మీ రామకృష్ణన్, వినయ ప్రసాద్ తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: సీతారామశాస్త్రి, కృష్ణచైతన్య, ఛాయాగ్రహణం: విజయ్ కె. చక్రవర్తి, డాన్స్: రాజు సుందరం, దినేశ్, రఘు, సుచిత్ర, కళ: ఎస్. రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: అశోక్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వేణు శ్రీరామ్.

English summary
"The album consists of 5 songs and one bit song. Most of our films are musical hits and I am sure that these songs would also top the chart busters. Our director Venu Sriram extracted good tunes from new music composer Rahul Raj," Dil Raju said.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more