»   » రీమేక్ సరే...మణిరత్నం మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

రీమేక్ సరే...మణిరత్నం మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ' ఓకే కన్మణి' (తెలుగులోఓకే బంగారం ). ఇందులో తుల్కర్‌ సల్మాన్‌, నిత్యామీనన్‌ జంటగా నటించారు. ఈ చిత్రం ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడీ ఈ చిత్రాన్ని బాలీవుడ్ లోకి రీమేక్ అవుతోంది. అయితే నిత్యామీనన్, దుల్కర్, మణిరత్నం చేసిన మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అనే సందేహాలు అంతటా వ్యక్తం అవుతున్నాయి.

అందుతున్న సమాచారం ప్రకారం మణిరత్నం వద్ద అసిస్టంట్ గా పనిచేసిన షాద్ ఆలీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ హిందీ వెర్షన్ లో ఆదిత్య రాయ్ కపూర్, సొనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులుగా నటించనున్నారు. ఈ సినిమా త్వరలో షూటింగ్ ప్రారంభంకానుంది. ఒక ప్రముఖ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

'Ok Bangaram' Bollywood remake details

'ఓకే బంగారం' కథేమిటంటే...

ముంబైలో కార్పోరేట్ సంస్ధలలో పనిచేస్తున్న ఆది (దుల్కర్ సల్మాన్),తార(నిత్యామీనన్) పోష్ లైఫ్ ని గడుపుతూంటారు. పెళ్లనే కాన్సెప్ట్ ని నమ్మని వీళ్లిద్దరూ ...అనుకోని పరిస్ధితుల్లో పరిచయమై...ఆ స్నేహం అనతికాలంలోనే ఏకాభిప్రాయాలతో బలపడి...సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్ షిప్)గా రూపాంతరం చెందుతుంది. అయితే తమ భవిష్యత్ కోసం వీరిద్దరూ వేరు వేరు దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్ధితి వస్తుంది. ఈ నేపధ్యంలో వీరు తమ బంధానికి ఫుల్ స్టాప్ చెప్తారా..లేక దాన్ని పెళ్లితో బలపరుచుకుంటారా అనేది కథలో కీలకాంశం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

English summary
Now preparations are being done to remake Mani Ratnam's last romantic venture 'Ok Bangaram'... film in Hindi.As per sources, Aditya Roy Kapoor, who shot to fame with 'Aashiqui 2' and Sonakshi Sinha might play the lead roles in this movie. A big production house will back this project. More details about director and release etc. will be announced officially soon.Mani Ratnam has already roped in star cast for his next film. Karthi, Dulquer Salman, Shruthi Haasan and Nayanatara will play lead roles in this film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu