»   »  మరో నెల రోజుల్లో నిహారిక ఫ్యూచర్ ఏమిటో తేలిపోతుంది!

మరో నెల రోజుల్లో నిహారిక ఫ్యూచర్ ఏమిటో తేలిపోతుంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిహారిక కొణిదెల నాగ శౌర్య జంటగా, TV 9 సమర్పణలో, మధుర ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఒక మనసు చిత్రం జూన్ 24 న విడుదలకు సిద్ధమవుతోంది.

నిహారిక కోసం వస్తున్నా...నాగబాబు వద్దంటున్నాడట!

ఇటివలే మెగా హీరోల చేతుల మీదుగా విడుదలైన పాటలకు శ్రోతలనుండి విశేష స్పందన లభిస్తోందని, సినిమా ఫస్ట్ లుక్ మొదలుకుని ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ వరకూ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అనూహ్యమైన స్పందన తమకెంతో ఆనందాన్ని కలిగిస్తుందని చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి తెలిపారు.

‘Oka Manasu’ releasing on June 24

ఇప్పటి రొటీన్ చిత్రాలకి విభిన్నంగా ఒక హృద్యమైన ప్రేమకధతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో నిహారిక, నాగ శౌర్యల నటన ఆకట్టుకుంటుందనీ, ప్రేమ, కుటుంబం, బాధ్యతలు వాటి విలువలు లాంటి అంశాలతో ముడిపడివున్న ఈ ఒక మనసు సినిమా ప్రతి మనసుని అలరిస్తుందని, సునీల్ కశ్యప్ బాణీలు అందించిన ఈ చిత్రాన్ని జూన్ 24 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రామరాజు తెలిపారు.

‘Oka Manasu’ releasing on June 24

'ఒక మనసు' సినిమా రిజల్టు మీదనే నిహారిక సినీ భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చి, నిహారికకు మంచి పేరు వస్తేనే ఆమె సినిమాల్లో కొనసాగే అవకాశం ఉంది. ఏదైనా తేడా వస్తే నిహారిక మళ్లీ తెరపై కనపించే అవకాశం లేదని అంటున్నారు.

English summary
Oka Manasu, starring Niharika Konidela and Naga Shourya as the main lead, is produced by Madhura Sreedhar Reddy under Madhura Entertainment banner along with popular news channel TV 9. Oka Manasu written and directed by Rama Raju is all set to hit the silver screens on June 24.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu