»   » ఒక మనసుకీ కత్తిరింపులు తప్పలేదా... నిహారిక సీన్లు కొన్ని కట్

ఒక మనసుకీ కత్తిరింపులు తప్పలేదా... నిహారిక సీన్లు కొన్ని కట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ఒక మనసు".. అనే పేరుతో సినిమా ప్రకటించడం. అందులో నాగబాబు కుమార్తె నిహారిక నటిస్తుంది అనగానే.. సినిమాకు క్రేజ్‌ వచ్చింది. మెగా కుటుంబంలోంచి హీరోయిన్‌ వస్తుంది. తను ఎలా చేస్తుందనే ఇంట్రెస్ట్‌ అందరికీ కలిగింది. దానికితోడు 'మల్లెల తీరంలో సిరిమల్లెచెట్టు'.. అనే క్యూట్‌ లవ్‌ స్టోరీ తెరకెక్కించిన రామరాజు దర్శకత్వంలో రావడం... దీనికి మధుర శ్రీధర్‌తో పాటు టీవీ9 ఛానల్‌ కూడా ప్రొడక్షన్‌లో ఇన్‌వాల్వ్‌ కావడం మరింత క్రేజ్‌ తెచ్చింది.

చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకూ హీరోలే పరిచయం కాగా, మొదటిసారి హీరోయిన్‌గా నిహారిక పరిచయమవుతూ చేసిన సినిమా కావడంతో "ఒక మనసు" పై మొదట్నుంచీ మంచి అంచనాలే ఉన్నాయి.


Oka Manasu trimmed by 14 minutes

ఆ అంచనాల మధ్యనే నిన్న పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.కథ చెప్పిన విధానం, మంచి విజువల్స్‌కు పేరొచ్చినా, సినిమా నిడివిపై ఎక్కువగా విమర్శలు వినిపించాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన టీమ్ దాదాపు 15 నిమిషాల నిడివిని కత్తిరించింది. ఫస్టాఫ్‌లో కథ గమనాన్ని ఎఫెక్ట్ చేయని ఓ పావుగంట సన్నివేశాలకు కత్తెర వేశారు.


ఇలా ట్రిమ్ చేసిన వెర్షన్ ను ఈ రోజు నుంచే అన్ని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ కత్తిరింపుతో ప్రేక్షకుల బోరె ఫీల్ తగ్గుతుందనీ. సిమ్నిమా మరింత పుంజుకుంటుందనీ అంటున్నారు.నిహారికా నాగ శౌర్య ల నటనకి మంచి మార్కులే పడ్డా సాగదీసినట్టున్న కథనం ఈ సినిమాకి మైనస్ అయ్యిందన్న టాక్ రావటం తో కొన్ని సీన్లని తీసేసి జరిగిన నష్టాన్ని కవర్ చేసే ప్రయత్నం లో పడ్డారు.

English summary
Oka Manasu starring Niharika Konidela and Naga Shourya is in theaters.But the unanimous opinion is it is too slow and lengthy. Even the public talk is same. Hence the producer Madhura Sridhar has decided to trim the movie. The shorter version of Oka Manasu will now be screened in theaters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu