»   »  గాలిపటం

గాలిపటం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bhoomika
'ఒక ఊరిలో' సినిమాతో పరిచయమై రమేష్ వర్మ తాజాగా 'గాలిపటం' అనే చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నాడు. అంతా కొత్త వారితో చేసే ఈ సినిమా కథ కూడా కొత్త గానే ఉంటుందంటున్నాడు. ఇటీవలే కన్నడలో హిట్టయిన 'గాలిపట' సినిమాకీ దీనికీ టైటిల్ లో తప్ప పోలిక లేదని చెప్తున్నాడు.మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కౌశిక్ నిర్మిస్తున్నారు. అలాగే రమేష్ వర్మ ..సముద్ర దర్సకత్వంలో రాబోతున్న 'మల్లెపూవు' సినిమాకూ కథ అందించాడు. అయితే ఆ చిత్ర కథ ఇరాన్ సినిమా 'బరాన్' పోలికలు ఉన్నాయని టాక్ రావటం,సముద్ర ఖండిచటం జర్గిపోయాయి. దాంతో సహజంగానే ఈ గాలిపటం చిత్రం కూడా ఏ దేశం బిడ్డో అని వెనకు గుసగుసలాడుతున్నారు. అవన్నీ ప్రక్కన పెడితే మంచి విజువల్ సెన్స్ ఉన్న దర్శకుడుగా మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకున్న రమేష్ వర్మ ఈ సారన్నా కమర్షియల్ హిట్టివ్వాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. అందుకే గాలిపటం ఎగరాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X