»   » "ఒక్క అమ్మాయి తప్ప" మే చివర్లోనే వస్తోంది

"ఒక్క అమ్మాయి తప్ప" మే చివర్లోనే వస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్ర‌స్థానం వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన సందీప్‌ కిష‌న్‌. హీరోగా నిలదొక్కుకోవటానికి బలంగానే ప్రయత్నిస్తున్నాడు. సందీప్ హీరో గా నటించిన మరో చిత్రం "ఒక్క అమ్మాయి తప్ప". కథా బలం ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విలక్షణమైన నటి నిత్యా మీనన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది. అసలు నిత్యా ఒప్పుకుందంటేనే సినిమా బావుంటుందనుకుంటున్నారు.

అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేసిన రాజసింహ తాడినాడ దర్శకత్వంలో మంచి అభిరుచి గల నిర్మాత గా, ఎగ్జిబిటర్ గా పేరు తెచ్చుకున్న బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా మే చివరి వారం లో విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది.


ఈ వారం లో నే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేస్తాం అని నిర్మాత బోగాది అంజిరెడ్డి అన్నారు. " మే చివరి వారం లో భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసాము. ఈ వారం లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత విడుదల తేదీని అధికారికం గా ప్రకటిస్తాము. సందీప్‌ కిష‌న్‌ కెరీర్ లో ఈ చిత్రం ఒక మయిలు రాయి వంటిది. ఇటీవలే విడుదల అయిన ఆడియో ఆల్బం ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు" అని ఆయన అన్నారు.

Okka Ammayi Thappa in May Last Week


కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, అందిస్తూ దర్శకత్వం కూడా వహిస్తున్న రాజసింహ తాడినాడ మాట్లాడుతూ "నేను జయంత్ గారి వద్ద, అలాగే పరుచూరి బ్రదర్స్ దగ్గర అసోసియేట్ రైటర్ గా వర్క్ చేశాను. ఇండిపెండెంట్ రైటర్ గా కూడా 15 సినిమాలకు పనిచేశాను. 2007లో ఈ సినిమా కథను రాసుకున్నాను. రెండు, మూడు సార్లు స్టార్ట్ అయ్యి కొన్ని కారణాలతో ఆగిపోయిన సినిమా. ఈ కథను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావని చాలా మంది అడిగారు, నాతో పాటు నన్ను, నా కథను నమ్మారు. ఛోటా కె.నాయుడుగారు ఈ ప్రాజెక్ట్ ను టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత సినిమా ట్రాక్ ఎక్కింది. బోగాది అంజిరెడ్డి వంటి నిర్మాతగారు ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో ఒక గంట పాటు సీజీ వర్క్ ఉంటుంది. కానీ అది తెలియదు. ఈ సినిమా కథలో ఎక్కువ భాగం హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై జరుగుతుది. అక్కడా షూటింగ్ కుదరదు కాబట్టి అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి మిగతాదంతా గ్రాఫిక్స్ లో క్రియేట్ చేశాం. నిత్యాగారు నాలుగు గంటల పాటు కథ విని ఒప్పుకున్నారు. అద్భుతంగా సపోర్ట్ చేశారు. అలాగే సందీప్ నన్ను నమ్మి సపోర్ట్ చేశారు. నిర్మాత అంజిరెడ్డిగారికి థాంక్స్. ఒక్క అమ్మాయితప్ప అందరినీ నవ్విస్తుంది, ఎంటర్ టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది" అన్నారు.

నటీ నటులు - సందీప్ కిషన్, నిత్యా మీనన్ , రేవతి , రవి కిషెన్, అలీ, అజయ్,బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రాహుల్ దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్,నళిని, జ్యోతి తదితరులు.
సినిమాటోగ్రాఫర్‌: ఛోటా కె.నాయుడు, మ్యూజిక్‌: మిక్కి జె.మేయర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు : శ్రీమణి, శ్రీ శశి జ్యోత్న్స మరియు డాక్టర్ మీగడ రామలింగ శర్మ
సహ నిర్మాతలు : మాధవి వాసిపల్లి, బోగాది స్వేచ్ రెడ్డి , నిర్మాత: బోగాది అంజిరెడ్డి

English summary
Sundeep Kishan is playing the lead role in the movie 'Okka Ammayi Thappa'. Nithya Menen, who is known for choosing films with strong content, is playing the female lead. The film will be hitting the screens in the last week of May
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu