»   » "ఒక్క అమ్మాయితప్ప" కథ వెనుక కథ చెప్పిన డైరెక్టర్

"ఒక్క అమ్మాయితప్ప" కథ వెనుక కథ చెప్పిన డైరెక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొత్త డైరెక్టర్ రాజసింహా... ఒకరోజూ రెండురోజులూ కాదు ఈ అవకాశం కోసం దాదాపు పదిహేనేళ్ళుగా ఎదురు చూసాడతను. చాలామంది డైరెక్టర్ల దగ్గర శిష్యరికం చేసి., ఆ తర్వాత రచయితగా "రుద్రమదేవి" లాంటి కొన్ని భారీ చిత్రాలకు పని చేస్తూనే తన కలని నెరవేర్చుకునేందుకు అహర్నిషలూ కష్ట పడ్డాడు.

ఎట్టకేలకు "ఒక్క అమ్మాయి తప్ప" సినిమాతో అతని కల నెరవేరింది. దర్శకుదయ్యాడు. ఈ కథ తను ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్ళలో పదేళ్ల కిందట రాసుకున్నదట. ఇది ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో నడిచే కథ అని ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది.

సగం సినిమా రోడ్డు మీదే నడుస్తుందని., అక్కడే అనేక మలుపులు తిరుగుతందని.,ట్రాఫిక్ జామ్ కావడమే సినిమాలో కథకు కీలకమైన మలుపనీ చెప్పాడు రాజసింహా. ఆయన చెప్పిన ప్రకారం తన నిజ జీవిత అనుభవమే ఈ కథ 2006లో మూసాపేట ఫ్లై ఓవర్ మీద తాను ట్రాఫిక్‌లో చిక్కుకున్నానని. అప్పుడే ఈ కథ తాలూకు ఆలోచన తళుక్కున మెరిసిందని..

Okka Ammayi Thappa Story strikes in Traffic Jam

వెంటనే కథ మొదలుపెట్టానని. అప్పట్నుంచి దర్శకుడు కావడం కోసం ఈ కథని పట్టుకొని చాలామంది నిర్మాతల్ని కలిశానని చెప్పాడు. తన నిజజీవితానుభవం కాబట్టే దగ్గరగా ఉండేందుకు తన కుమారుడు "కృష్ణ వచన్" పేరే ఈ సినిమా కథానాయకుడికీ పేరుగా పెట్టాడట.

సందీప్ కిషన్‌కు కూడా నాలుగేళ్ల కిందటే ఈ కథ చెప్పాడట. అయితే కొన్ని కారణాల వల్ల అప్పుడు ఈ ప్రాజెక్టు . కానీ ఎట్టకేలకు గత ఏడాది తన ప్రయత్నం ఫలించిందని అన్నాడు.దర్శకుడిగా తన తొలి సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఐతే రాజసింహా చెబుతున్నదంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమా "ఫోన్ బూత్" అనే హాలీవుడ్ సినిమాకు ఫ్రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది టాలీవుడ్లో. మరి అదే నిజమైతే.. రాజసింహా ఇప్పుడు చెబుతున్నదంతా ఇంకో కట్టుకథ అనుకోవాలి మరి నిజానిజాలు "ఒక్క అమ్మాయి తప్ప" వచ్చాకే తెలుస్తాయి.

English summary
Director reveals inspiration behind Okka Ammayi Thappa’s story
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu