»   » ‘ఒక్క క్షణం’ ఆలోచిస్తే!

‘ఒక్క క్షణం’ ఆలోచిస్తే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వలన మనం జీవితంలో ఏం కోల్పోతున్నామో సోదాహరణంగా తెలియజెబుతూ సందేశానికి వినోదాన్ని జోడించి రూపొందించిన చిత్రం 'ఒక్కక్షణం". సెవెన్ హిల్స్ టెలినెట్వర్క్స్ పతాకంపై కొడాలి వెంకటేశ్వర రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెట 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్సాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాతలు, దర్శకుడితో పాటు.ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సౌత్ ఇండియన్ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి. కళ్యాణ్, వడ్లపట్ల మోహన్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సి. కళ్యాణ్ మాట్లాడుతూ 'అలజడి" లాంటి వైవిధ్యమైన సినిమాను నిర్మించిన కొడాలి వెంకటేశ్వర రావు తొలిసారిగా 'ఒక్క క్షణం" చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన ఆలోచనా సరళి మొదట్నుంచి వైవిధ్యంగా వుంటుంది అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ 'ఒక్క క్షణం" ఆలోచిస్తే మంచి జరుగుతుంది అనే కాన్సెప్ట్ ను ఒకటిన్నర గంటలో అద్బుతంగా చూపించారు. సదుద్దేశ్యంతో రూపొందించిన ఈ చిత్రం ఎకరికైనా చూపించడానికి సిద్దంగా వున్నాను. ఈ చిత్రాన్ని తామంతా చూసామని మంచి సినిమాలు రావడంలేదని బాధపడేవాళ్లంతా చూసి తీరాల్సిన చిత్రమిదని ఈ సందర్బంగా వారంతా అభిప్రాయ పడ్డారు. రాజీవ్ కనకాల, అహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల, జీవ, ఎల్ బి శ్రీరామ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోసిస్తున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu