»   »  ఒక్క మగాడుకు అంతపెట్టారా?

ఒక్క మగాడుకు అంతపెట్టారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu


ఇంకా పూర్తికాని బాలకృష్ణ ఒక్క మగాడు సినిమా రికార్డులు సృష్టిస్తోంది. శాటిలైట్ హక్కులకే రూ.2.25 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించగా పంపిణీ హక్కులు కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయినట్టు సమాచారం. బాలకృష్ణ నటించిన గత చిత్రం మహారథి కేవలం పదికోట్ల రూపాయలకే డిస్ట్రిబ్యూషన్ హక్కులు అమ్ముడవగా, ఈ చిత్రం ఏకంగా రూ.25కోట్లు సాధించి టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఫిల్మ్ నగర్ గా మారింది.

ఈ సంక్రాతికి విడుదలవనున్న అన్ని చిత్రాల్లోకీ ఈ చిత్రమే అత్యధిక మొత్తంలో అమ్ముడుపోవడం కూడా అందరినీ ఆచర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రం హక్కులను పిరమిడ్ సాయిమీరా పొందింది. విడుదల అయిన తరువాత మరెన్ని రికార్డులు సృష్టించనున్నదో.

Read more about: okka magadu balakrishna simran
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X