»   » యాక్షన్ అదిరిపోయింది..., తమన్నా కాల్చి పడేస్తోంది.. దుమ్మురేపిన టీజర్

యాక్షన్ అదిరిపోయింది..., తమన్నా కాల్చి పడేస్తోంది.. దుమ్మురేపిన టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్‌ హీరో విశాల్ ‌- తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం 'ఒక్కడొచ్చాడు'. షూటింగ్‌ పూర్తి చెసుకున్నట్టే... ఒక్కడు' ఉన్న తెలుగు సినిమా టైటిల్స్‌ చాలానే ఉన్నాయి. ఒక్కడు చాలు, ఒకే ఒక్కడు, ఒక్కడు, ఒక్కడే, ఒక్కడున్నాడు, వీడొక్కడే, వీరుడొక్కడే, ఇలా తెలుగులో చాలా చిత్రాలొచ్చాయి. లేటెస్టుగా నారా రోహిత్ 'అప్పట్లో ఒకడుండేవాడు' అనే టైటిల్ తో రెడీ అవుతున్నాడు. విక్రమ్ 'ఇరుముగన్'ను 'ఇంకొక్కడు' అంటూ వచ్చేసాక ఇప్పుడు విశాల్ కూడా ఒక్కడు గానే వస్తున్నాడు.. తమిళం లో "కత్తి సండై" పేరుతో వచ్చిన సినిమా ఇప్పుడు తెలుగులో "ఒక్కడొచ్హాడు" గా రానున్న సంగతి తెలిసిందే..

సూరజ్ తెరకెక్కిస్తున్న 'కత్తి సండై' యాక్షన్ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో విశాల్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. మన జగపతి బాబుతో పాటూ బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. జ‌గ‌ప‌తి బాబువిల‌న్ గా న‌టిస్తున్న ఈ సినిమా త‌మిళ టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. అదిరి పోయే యాక్ష‌న్ సీన్లుతో ఈ టీజ‌ర్ నిండి ఉంది. దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఓ వారం క్రితం తమిళ్ టీజర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఒక్కడొచ్చాడు టీజర్ కూడా వచ్చేసింది.

అసలు ఈ టీజర్ కంటే ముందు 'నే కొంచెం నలుపులే' అంటూ ఓ పాట విడుదల చేసి ఆశ్చర్యపరిచిన విశాల్.. ఇప్పుడు మాత్రం టీజర్ తో కేకలు పెట్టించేశాడనే చెప్పాలి. యాక్షన్ ఎలిమెంట్స్ ఆ రేంజ్ లో ఉన్నాయ్ మరి. టీజర్ స్టార్టింగ్ లో మొదలుపెట్టి.. కేరక్టరైజేషన్ గురించి చెప్పకుండానే.. సినిమాలో టేకింగ్ ఏ రేంజ్ లో ఉందో చూపించుకుంటూ.. హీరో చెప్పే ఒకే ఒక డైలాగ్ తో టీజర్ కట్ చేశాడు దర్శకుడు సురాజ్. 'తప్పు చేసిన వాడినైనా క్షమిస్తాను.. కానీ చేసిన తప్పును సమర్ధించే వాడిని.. ఎప్పటికీ క్షమించను' అంటూ విశాల్ చెప్పడమే మొత్తం టీజర్ తో వినిపించే డైలాగ్. ఈ పాయింట్ చుట్టూనే సినిమా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

English summary
The Tamil star is paired with Tamannaah Bhatia in this Tollywood outing and nothing in the teaser will grab your eyes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu