twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేయలేదు: మంచు మనోజ్

    అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా రూపొందిన చిత్రం ఒక్క‌డు మిగిలాడు. సినిమాను న‌వంబర్ 10న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది.

    By Bojja Kumar
    |

    మంచు మనోజ్ హీరోగా అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఒక్క‌డు మిగిలాడు. ప‌ద్మ‌జ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌పై ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

    చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన చిత్రం ఎట్టకేలకు న‌వంబర్ 10న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా శనివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.

    ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుక‌ుని చేసిన సినిమా ఇది

    ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుక‌ుని చేసిన సినిమా ఇది

    మంచు మ‌నోజ్ మాట్లాడుతూ ``ఈ స్క్రిప్ట్‌కు నేను గౌర‌వ‌మివ్వాల‌ని ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుక‌ుని చేసిన సినిమా ఇది. సిరియా, ఆఫ్రికా, బంగ్లాదేశ్‌, కొరియా త‌దిత‌ర దేశాల్లో యుద్ధాలు జ‌రిగిన‌ట్టు, బాంబులు పేలిన‌ట్లు వార్త‌లు చూస్తుంటాం. సిరియాలో ఓ చిన్న పాప నీటిలో కొట్టుకుని వ‌చ్చిన ఫోటో చూసిన‌ప్పుడు సిరియాలో ఏం జ‌రుగుతుంద‌నే విష‌యం తెలిసి, ప్ర‌పంచం ఉలిక్కి ప‌డింది. ఓ ఫోటో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే, సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందోన‌నే ఉద్దేశంతో ద‌ర్శ‌కుడు ఆలోచించుకుని ఈ సినిమా చేశాడు'' అని చెప్పుకొచ్చారు.

    అలాంటివి రేపు మనకు కూడా జరుగొచ్చు

    అలాంటివి రేపు మనకు కూడా జరుగొచ్చు

    శ్రీలంక బేస్ చేసుకుని త‌యారు చేసుకున్న క‌థ కాదు. బాధ‌లోని ప్ర‌తి ఒక్క‌రి కోసం చేసిన సినిమా. శ్రీలంక అంటే ఒక‌ప్పుడు మ‌న దేశ‌మే. మ‌న అన్నా చెల్లెలే. శ్రీలంక నుండి ఇక్క‌డ‌కు వ‌స్తే అక్క‌డి వార‌ని అంటున్నారు. అక్క‌డికి వెళితే ఇక్క‌డివార‌ని అంటున్నారు. శ‌ర‌ణార్థుల‌ని అంటున్నారు. వారికి జరినట్లే రేపు మ‌న‌కు కూడా జ‌ర‌గొచ్చు... అని మనోజ్ వ్యాఖ్యానించారు.

    ఫస్టాఫ్‌లో యుద్ధం, సెకండాఫ్‌లో జ‌ర్నీ

    ఫస్టాఫ్‌లో యుద్ధం, సెకండాఫ్‌లో జ‌ర్నీ

    యుద్ధంలో రెండు వ‌ర్గాలు కొట్టుకునేట‌ప్పుడు , యుద్ధానికి సంబంధం లేని కొన్ని కుటుంబాలు త‌ప్పించుకుపోయే క్ర‌మంలో ఓ ప‌డ‌వ ఎక్కితే...అస‌లు ప‌డ‌వ క‌రెక్ట్ దిశ‌లో వెళుతుందా? గ‌మ్యం క‌రెక్ట్‌గా చేరుకుంటామా? అని ఎవ‌రూ చెప్ప‌లేరు. ఇలాంటి ఓ స‌న్నివేశాన్ని దర్శ‌కుడు అజ‌య్‌గారు బ్యూటీఫుల్ ప్లానింగ్‌తో ఫస్టాఫ్‌లో యుద్ధం, సెకండాఫ్‌లో సీ జ‌ర్నీ చిత్రీక‌రించారని మనోజ్ తెలిపారు.

    ఎవ‌రినీ కించ‌ప‌రిచే ఉద్దేశంతో ఈ సినిమా చేయలేదు

    ఎవ‌రినీ కించ‌ప‌రిచే ఉద్దేశంతో ఈ సినిమా చేయలేదు

    ఈ సినిమాలనే నేను రెండు పాత్ర‌ల్లో క‌న‌ప‌డ‌తాను. ఎవ‌రినీ కించ‌ప‌రిచే ఉద్దేశంతో ఈ సినిమా చేయలేదు. ప్ర‌తి ఒక్క‌రూ బాధ్యత తీసుకున్న రోజునే మ‌న దేశం ముందుకెళుతుంది. ఈ సినిమాకు అజ‌య్‌గారే హీరో. శివ నందిగాం బ్యాగ్రౌండ్ స్కోర్‌, రామ‌రాజుగారి సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. దర్శకుడి ఆలోచనలకు తగిన విధంగా నిర్మాత‌లు ఎంతో సహకారం అందించారు అని మనోజ్ తెలిపారు.

    పాటలు ఉండవు

    పాటలు ఉండవు

    ఈ సినిమాలో సాంగ్స్ ఉండ‌వు. సినిమా ప్రారంభ‌మైనప్ప‌టి నుండి ముగిసే వ‌ర‌కు ఓకే టెంపోలో సినిమా ఉంటుంది. బ్ర‌త‌క‌డానికి మ‌నిషి అనేవాడు ఎంత క‌ష్ట‌ప‌డుతున్నాడ‌నే సామాన్యుడి వేద‌న ఈ సినిమాలో క‌న‌ప‌డుతుంది. ఈ సినిమా కోసం మనోజ్ ప‌డిన క‌ష్టం తెర‌పై చూస్తే మీకే తెలుస్తుంది. వెయిట్ పెరిగారు, మ‌ళ్లీ వెయిట్ త‌గ్గారు. న‌టించ‌డమే కాదు, అమేజింగ్ యాక్ష‌న్ సీన్‌ను కంపోజ్ చేశారు... అని దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి తెలిపారు.

    ఒక్కడు మిగిలాడు

    మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి.

    English summary
    Okkadu Migiladu Pre Release Function held at Hyderabad. Nara Rohit, Manchu Manoj, Anisha Ambrose, Ajay Andrews Nuthakki, Siva R Nandigam, SN Reddy, RP Patnaik, N Shankar, Veeru Potla, Andy Srinivasan, Sathya Reddy, BV Reddy, Pratani Ramakrishna Goud, Ramadurgam Madhusudhan at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X