»   »  ‘ఓం నమో వెంకటేశాయ’లో జగపతి బాబు ఫస్ట్ లుక్ ఇదే!

‘ఓం నమో వెంకటేశాయ’లో జగపతి బాబు ఫస్ట్ లుక్ ఇదే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అన్నమయ్య, శ్రీరామదాసు తర్వాత నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు నటుడు జగపతిబాబు కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.

ఈ మూవీలో జగపతిబాబు ఓ మహారాజు క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం. భక్తిరస చిత్రాల్లో తన మార్క్ రొమాన్స్ వుండేలా చూసుకునే రాఘవేంద్రరావు ఈ మూవీలో కూడా జగపతిబాబును ప్రత్యేకంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో జగపతిబాబు 'కంచె' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తో రొమాంటిక్ సాంగ్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

జగపతి బాబు

జగపతి బాబు

ఇప్పటి వరకు జగపతి బాబును వివిధ పాత్రల్లో చూసాం. అయితే కెరీర్లో తొలిసారిగా ‘ఓం నమో వెంకటేశాయ' లాంటి డివోషనల్ చిత్రంలో ఆయన డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారు.

rn

ఓం నమో వెంకటేశాయ

సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

నటీనటులు

నటీనటులు

అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా మరో అద్భుతమైన పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్‌ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.

English summary
Firstlook of Jagapathi Babu in "Om Namo Venkatesayaa" released. He will be seen in couple of romantic songs in the film romancing "Kanche" hottie Pragya Jaiswal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu