»   » చీకటికోణాలతోనే ఆయన బయోపిక్: ఇద్దరు భార్యలూ అదే ప్రయత్నాల్లో

చీకటికోణాలతోనే ఆయన బయోపిక్: ఇద్దరు భార్యలూ అదే ప్రయత్నాల్లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎక్కువగా కమర్షియల్ సినిమాల కన్నా ఆఫ్ బీట్ సినిమాలలో ఎక్కువగా కనిపించే ఓం పూరీ తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. అద్భుత నటనతో ఆయన పలుసార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఓంపురి హర్యానాలోని అంబాలా ప్రాంతంలో పంజాబీ కుటుంబంలో అక్టోబర్‌ 18, 1950లో జన్మించారు. పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ ఇండియాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.1976లో మరాఠీ చిత్రం 'ఘాశీరామ్‌ కొత్వాల్‌'తో సినీరంగ ప్రవేశం చేశారు. 1982లో 'అరోహణ్‌', 1984లో 'అర్ధ్‌ సత్య' చిత్రాలకు గానుఆయన జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి 'పద్మశ్రీ' పురస్కారం పొందారు. తెలుగులో 'అంకురం' చిత్రంలో నటించారు. కొన్ని నెలల కిందటే ఆయన మరణించాడు.... అలా ఒక ప్రస్థానం ముగిసిపోయింది. అయితే ఆయన జీవితం లో కొన్ని చీకటి కోణాలూ ఉన్నాయి... వాటినికూడా కలుపుకొనే ఆయన జీవితాన్ని సినిమాగా తీయబోతున్నారు.. అదీ ఎవరో కాదు ఆయన భార్యలే...

ఓమ్ పురి

ఓమ్ పురి

ఈ సీనియర్ నటుడి జీవితం ఉన్నది ఉన్నట్టుగా తియ్యడానికి రెడీ అయిపోతున్నారట ఇద్దరు సతీమణులు.. అయన ఈ ఏడాది మొదటి నెలలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఓమ్ పురి వెండి తెరపై విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం కాస్త కష్టాలను అనుభవించాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

ఇద్దరు భార్యలు

ఇద్దరు భార్యలు

ముఖ్యంగా ఆయన వివాహమాడిన ఇద్దరు భార్యలు వివాదంతో ఆయన నుంచి విడిపోవడం ఓంపూరి జీవితంలో ఓ కీలక మలుపు. అయితే ఆయన జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తాను అంటోంది మొదటి భార్య సీమా కపూర్. ఇక రెండవ భార్య నందిత కూడా ఓంపురి జీవితాన్ని తెరకెక్కిస్తాను అంటోంది.

అన్ లైక్లీ హీరో

అన్ లైక్లీ హీరో

అయితే నందిత మాత్రం తాను రాసుకున్న ‘అన్ లైక్లీ హీరో' అనే పుస్తకం ఆధారంగానే సినిమా తీస్తాను అంటోంది. అప్పట్లో అమ్మడు ఈ పుస్తకావిష్కరణ చేస్తాను అంటే ఓంపురి అడ్డుకున్నాడు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఆయన గురించి కొన్ని వివాదాస్పద విషయాల్ని పేర్కొనడం ఆయనకు నచ్చలేదు.

నేనే సినిమా తీస్తాను

నేనే సినిమా తీస్తాను

మరి ఇప్పుడేమో ఏకంగా సినిమానే తీస్తాను అంటోంది. ఇక భర్త చనిపోయి ఏడాది కూడా అవ్వకముందే సతీమణులు ఇద్దరు మీడియాకెక్కి నేనే సినిమా తీస్తాను అని చెప్పడం బాలీవుడ్ లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

English summary
Bollywood senior actor Om Puri's ex wife Seemaa kapoora and his second Wife Nandita both are Trying to make a Biopic on Om puri's life
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu