»   » పగతో రగులుతోన్న సినీ నటుడి ఆత్మ? మళ్ళీ కలకలం రేపుతున్న వీడియో

పగతో రగులుతోన్న సినీ నటుడి ఆత్మ? మళ్ళీ కలకలం రేపుతున్న వీడియో

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ఓంపురి(66) కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే సహజంగా జరిగిన ఈ మృతి వెనక ఓ పెద్ద కుట్ర ఉందని పాకిస్దాన్ కు చెందిన టీవి ఛానెల్ ఆరోపిస్తోంది. అంతేకాదు ఆ కుట్ర చేసింది ప్రధాని నరేంద్ర మోడి అని చెప్తూ ఓ పోగ్రాం ప్రసారం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే... ఓంపురిది స‌హజ మ‌ర‌ణం కాదని, ఆయ‌న‌ను హ‌త్య చేశారాఅంటోంది పాకిస్థాన్‌కు చెందిన బోల్‌టీవీ అనే చాన‌ల్‌. ఓంపురి హ‌త్య వెన‌క మోదీ హ‌స్తం ఉంద‌ని ఆరోపించింది. పాకిస్థాన్ క‌ళాకారుల‌కు ఆయ‌న మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో జీర్ణించుకోలేని మోదీ ఓంపురిని చంపించార‌ని పేర్కొంది.

సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో

సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో

గత జనవరిలో మరణించిన ఓంపురి తన మరణానికి కొద్ది రోజుల ముందు యూరీ సెక్టార్లో దాడులు - సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో ఓంపురి కొన్ని వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ టార్గెట్ గా ఆయన మాట్లాడారు. అప్పట్లో అది కాస్త వివాదమైంది.

పాక్ మీడియా

పాక్ మీడియా

ఆ తరువాత కొద్దికాలానికే ఆయన మరణించారు. అయితే... పాక్ మీడియా దీనిపై చిలవలుపలవలుగా కథనాలు వేస్తోంది.పాక్‌లోని బోల్ న్యూస్ జనవరి 14న ఓ వీడియో ప్రసారం చేసింది. సీసీ టీవీ ఫుటేజి అయిన అందులో తెల్ల కుర్తా ధరించిన ఓ వ్యక్తి కనిపించాడు.

ఓంపురి ఆత్మ

ఓంపురి ఆత్మ

అది ఓంపురి ఆత్మ అని, ముంబైలోని తన ఇంటి ముందు తిరుగుతోందని, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌పై పగ తీర్చుకోవడానికి చూస్తోందని బోల్ న్యూస్ టీవీ కల్పనలతో కథనం అల్లేసింది. సీసీ టీవీ ఫుటేజి అయిన ఆ వీడియోలో తెల్ల కుర్తా ధరించిన ఓ వ్యక్తి కనిపించగా అది ఓంపురి ఆత్మ అని ముంబైలోని తన ఇంటి ముందు తిరుగుతోందని పాకిస్థాన్ కు చెందిన బోల్ న్యూస్ పేర్కొంది.

జనవరి 14న

జనవరి 14న

దీనిని ఆ టీవీ ఛానెల్ గత జనవరి 14న ప్రసారం చేయగా పాక్ కుట్రలు కుతంత్రాలను బయటపెడుతూ ‘ఆజ్ తక్' ఆ వీడియాను మొన్న వారాంతంలో ఖండిస్తూ కథనం ప్రసారం చేసింది. అజిత్ ధోవల్‌పై ఓంపురి ఆత్మ ఎందుకు పగ తీర్చుకోవాలని అనుకుంటోంది.

యురి దాడులపై

యురి దాడులపై

అంటే.. యురి దాడులపై అప్పట్లో చర్చనీయాంశమైన ఓంపురి వ్యాఖ్యలతో ముడిపెట్టింది పాక్ ఛానల్. ఆ వ్యాఖ్యల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ, అజిత్ దోవల్ కలిసి ఓంపురి హత్యకు పథకం వేశారని విష బీజాలు నాటేందుకు ప్రయాసపడింది. యురి సెక్టార్ లో దాడుల విషయంలో ఓంపురి వ్యాఖ్యలు చర్చనీయమైన సంగతి తెలిసిందే...

ఓంపురి హత్యకు పథకం

దీంతో ప్రధాని నరేంద్ర మోదీ అజిత్ దోవల్ కలిసి ఓంపురి హత్యకు పథకం వేశారని... ఓంపురికి అజిత్ దోవల్ సమన్లు జారీ చేసి విచారణలో దారుణంగా కొట్టారని అందుకే ఓంపురి ఆత్మ పగతీర్చుకోవాలని చూస్తోందంటూ కథనం వండి వార్చింది. అయితే ఈ దాడిని భారతీయ న్యూస్ చానెల్ ఆజ్ తక్ తన కథనం తో తిప్పికొట్టింది.

English summary
Aaj Tak Replays ‘News’ By A Pakistani Channel That Says Om Puri’s Ghost Is Seeking Revenge
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu