»   » అంకురం సత్యం, మిమ్మల్ని వెంటాడే పాత్ర...: ఆ సీనియర్ నటుడు ఇక లేడు

అంకురం సత్యం, మిమ్మల్ని వెంటాడే పాత్ర...: ఆ సీనియర్ నటుడు ఇక లేడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  1992 లో అంకురం అనే ఒక సినిమా వచ్చింది..1992వ సంవత్సరానికి ఉత్తమ తెలుగు చలనచిత్రంగా భారత జాతీయ చలన చిత్ర పురస్కారం. అందుకున్న సినిమా అది. తెలుగు సినిమాల్లో ఒక అద్బుతమ్నైన సినిమాగా నిలిచిపోయిన సినిమా అది. ఒకసారి ఆసినిమా మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇదే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించిన ఓం పురీ ఈ ఉదయం మరణించారు....

  సత్యం అనే పాత్రలో నటించిన ఓంపురీ మొహం సడెన్ గా గుర్తురాని ఒకరో ఇద్దరో ఉంటే రామ్ గోపాల్ వర్మ "రాత్రి" లో కనిపించిన భూతవైధ్యుడు గుర్తుండే ఉంటాడు. ఇప్పుడు ఓం పురీ లేడు నిన్నటి వరకూ బాలీవుడ్ లో మళ్ళీ ఇంకొక్క పాత్ర చేయాలని తపిస్తూనే ఉన్న ఓం పురీ గుండే సినిమానే చివరి సారిగా కలవరిస్తూ.... ఆగిపోయింది...ఊక సారి మళ్ళీ ఓమ్ పురీని తల్చుకుంటూ....

  సత్యం:

  సత్యం:

  సింధూరఅనే ఒక యువతి తన భర్తతో ట్రైన్‌లో వెళ్తుండగా ఎదురు సీట్ లోఉన్న సత్యం అనే మనిషి బిడ్డకు పాలు తెస్తా అని సింధూర చేతిలో బిడ్డను పెట్టి దిగేస్తాడు. కాని కారణాలు తెలీకుండా సత్యంను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. బిడ్డను ఇంటికి తీసుకెళ్లిన సింధూర

  భర్త దూరంగా పెట్టినా:

  భర్త దూరంగా పెట్టినా:

  అవమానాల మధ్యే ఆ పాప ఆలనా పాలన చూసుకుంటూ సత్యం ఆచూకీ కోసం ప్రయత్నిస్తుంది. భర్త దూరంగా పెట్టినా, ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించినా ఆమె ఆభిడ్దని తండ్రిదగ్గరకు చేర్చే ప్రయత్నం మానదు. అడుగు అడుగులో అడ్డంకులు ఎదురవుతుంటే వాటికి నెరవక ధైర్యంగా ముందుకు సాగి ఆత్మవిశ్వాసంతో సింధూర సత్యం కోసం వెదుకుతుంది.

   కోర్టులో కేసు:

  కోర్టులో కేసు:

  ఒక చిన్న క్లూ వల్ల సత్యం ఉండే ఊరేదో తెలుస్తుంది. ఇంతలో పౌరహక్కుల నాయకుడైన లాయర్ రావు సహాయంతో సత్యం కోసం కోర్టులో కేసు వేస్తుంది. రావుతో పాటు సత్యం ఉండే గిరిజన ప్రాంతానికి వెళ్తుంది. సత్యం విప్లవకారుడని ముద్ర పడ్డ గిరిజన నాయకుడని తెలుసుకుంటుంది. పోలీసులు సత్యాన్ని పట్టుకోలేక అతని భార్యను అరెస్ట్ చేసి ఆచూకీ కోసం వేధిస్తారు. దీనిని సహించలేని గిరిజనులు పోలీసులపై దాడికి ప్రయత్నిస్తారు.

  డాక్టర్ మిత్ర:

  డాక్టర్ మిత్ర:

  అయితే డాక్టర్ మిత్ర వారిని నిలవరిస్తాడు. ఒక శాడిస్టు పోలీసు అమానవీయ చర్యలతో సత్యం భార్య బిడ్డకు జన్మ ఇచ్చి చనిపోతుంది. దాంతో ఆవేశపడిన గిరిజనులు ఆ పోలీసుని చంపేస్తారు. దీనికి ప్రతిగా గిరిజనులకు అండగా నిలిచిన డాక్టర్ మిత్రను పోలీసులు చంపుతారు.

  చివరికి అతి కష్టం మీద:

  చివరికి అతి కష్టం మీద:

  సత్యం బిడ్డతో పారిపోతుండగా రైల్వే స్టేషన్‌లో పట్టుకుంటారు. ఇదంతా సింధూర, రావులకి ఎంక్వయిరీలో తెలుస్తుంది. చివరికి అతి కష్టం మీద కోర్టుకు సత్యం వచ్చేలా చేస్తుంది సింధూర. అప్పటికే పోలీస్ చేతుల్లో దెబ్బలు తిన్న సత్యం నిజాలు బయట పెట్టి కోర్టు లోనే కన్ను మూయటం, భర్త హరిబాబు బిడ్డతో సహా సింధూరను మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానించడంతో కథ ముగుస్తుంది.

  సినిమా చూస్తే:

  సినిమా చూస్తే:

  స్థూలంగా ఇదీ కథ ఈ కథలో సత్యం నిజజీవిత పేరు ఓమ్ పురీ బాలీవుడ్ నటుడు అత్యద్బుతమైన నటనతో తాను చేసిన సత్యం అనే పాత్రకి అద్బుతంగా పండించాడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సినిమా చూస్తే ఆపాత్ర మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది...

  నిన్నటి వరకూ బాలీవుడ్:

  నిన్నటి వరకూ బాలీవుడ్:

  ఇప్పుడు హఠాత్తుగా ఈ "ఈ అంకురం" అనే సినిమా గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే... ఇప్పుడు ఓం పురీ లేడు నిన్నటి వరకూ బాలీవుడ్ లో మళ్ళీ ఇంకొక్క పాత్ర చేయాలని తపిస్తూనే ఉన్న ఓం పురీ గుండే సినిమానే చివరి సారిగా కలవరిస్తూ.... ఆగిపోయింది...

  ఘాశీరామ్‌ కొత్వాల్‌:

  ఘాశీరామ్‌ కొత్వాల్‌:

  ఓం పురీ కేవలం బాలీవుడ్ నటుడు అనిమాత్రమే అనలేం ఒకే ఒక్క సినిమాతోనే తెలుగు సినిమా ఆయనని ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉంది. బాలీవుడ్ తో పాటు పాకిస్థానీ, బ్రిటీష్, హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. ఓంపురి. 1976లో మరాఠీ చిత్రం ‘ఘాశీరామ్‌ కొత్వాల్‌'తో సిల్వర్ స్క్రీన్ మీఅద కనిపించిన ఓపురీ ఒక దశలో బాలీవుడ్ దిగ్గజ నటుల్లో నంబర్ వన్ అని .

  పద్మశ్రీ' పురస్కారం:

  పద్మశ్రీ' పురస్కారం:

  ఓంపురి హర్యానాలోని అంబాలా ప్రాంతంలో పంజాబీ కుటుంబంలో అక్టోబర్‌ 18, 1950లో జన్మించారు. పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ ఇండియాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.1982లో ‘అరోహణ్‌', 1984లో ‘అర్ధ్‌ సత్య' చిత్రాలకు ఆయన జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ' పురస్కారం పొందారు. ఓంపురి...ప్రముఖ సినీనటుడు అమ్రిష్ పురి సోదరుడు. ఓమ్ పురీ నటుడిగా మాత్ర అమరుడే... ఆయన మరణానికి చింతిస్తూ నే ఉంటారు భారతీయ సినీ ప్రేమికులు.

  English summary
  Om Puri, who acted in both mainstream and art films, was known for his gritty performances in a number of landmark Indian films in the 1980s. star of British hit East is East, has died aged 66
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more