twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాస్య నటుడు 'జుట్టు నరసింహం' మృతి

    By Staff
    |

    Omakuchi Narasimhan
    బహుభాషా హాస్యనటుడు ఓమకుచ్చి నరసింహన్‌ (73) బుధవారం రాత్రి కన్నుమూశారు. ఏడాది కాలంగా గొంతు క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈయన ఆరోగ్యం క్షీణించి బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మంగమ్మగారి మనవడు వంటి చిత్రాల్లో కేవలం జుట్టుతోటే కామిడీ చేసిన ఆయన్ని మరిచిపోవటం కష్టమే. కొంతకాలం పాటు ఆయన పాత్ర లేకుండా రచయితలు సినిమా రాసేవారు కాదు. ఆ క్రమలంనే ఆయన సుమారు 1,500 తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాను పూర్తి చేసారు. 'జుట్టు' నరసింహంగా ఇక్కడ మనవాళ్లు గుర్తుపెట్టుకుంటే తమిళంలో 'ఓమకుచ్చి నరసింహన్‌' (బక్క నరసింహం) గా అలరించారు.

    ఇక ఆయన భారతీయ భాషలే కాకుండా 'ఇండియన్‌ సమ్మర్‌' అనే హాలీవుడ్‌ సినిమాలోనూ నటించటం విశేషం. తమిళంలో ప్రముఖ దర్శకుడు విసు దర్శకత్వం వహించిన 'సంసారం అదు మిన్సారం' చిత్రంలో నటనకుగాను జాతీయ అవార్డు అందుకోవ డం విశేషం. తమిళనాడులోని కరూర్‌ జిల్లా, కట్టలై గ్రామంలో జన్మించిన ఆయన, 13వ ఏట 'అవ్వయార్‌' (1945-50) చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. చదువు పూర్తయ్యాక ఎల్‌ఐసీలో కొంతకాలం ఉద్యోగం చేశారు. తన గురువు, నటుడు సురుళి రాజన్‌ ప్రోత్సాహంతో 1969లో 'తిరు కళ్యాణం' తమిళ చిత్రంతో పునఃప్రవేశం చేశారు. నరసింహులుకు భార్య సరస్వతి(68), కుమార్తెలు విజయలక్ష్మి, నిర్మలతోపాటు కొడుకు కామేశ్వరన్‌ ఉన్నారు. అమెరికాలో ఉంటున్న కూతురు నిర్మల వచ్చాక, శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తామ ని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ధట్స్ తెలుగు హృదయపూర్వకంగా కోరుకుంటోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X