»   » సల్మాన్ ఖాన్ వివాహం ఆమెతోనే! (ఈ ఫోటోలే సాక్ష్యం)

సల్మాన్ ఖాన్ వివాహం ఆమెతోనే! (ఈ ఫోటోలే సాక్ష్యం)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి చాలా కాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా సల్మాన్ ఖాన్ విదేశీ భామ లూలియా వేంటర్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని, ఆమెనే వివాహం చేసుకోబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై సల్మాన్ మాత్రం ఇప్పటికీ నోరు విప్పలేదు. ఆయన కుటుంబ సభ్యులు కూడా సల్మాన్ పెళ్లి విషయమై మాట్లాడటానికి ఇష్ట పడటం లేదు.

అయితే సల్మాన్-లులియా ఎఫైర్ విషయంలో వాస్తవాలు తెలుసుకునేందుకు మీడియా గ్రూఫులు తమ ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. గతంలో చాలా సందర్భాల్లో వీరు కలిసి కనిపించారు. లులియా సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి కూడా చాలా దగ్గరయిపోయింది. తాజాగా లులియా వేంటర్ సల్మాన్ ఖాన్ ఫ్యామిలీతో కలిసి బయటకు వస్తూ ముంబై ఎయిర్ పోర్టులో మీడియా ఫోటోగ్రాఫర్లకు చిక్కింది.

సల్మాన్ ఖాన్ తల్లి చేయి పట్టుకుని లులియా వేంటర్ ఉండటం.... మీడియాను చూడగానే సల్మాన్ తల్లి వారికి దూరంగా ఉండూ అనే విధంగా ఆమె చేయి పట్టుకుని పక్కకు జరిపే ప్రయత్నం చేసారు. లులియా కుర్తా, పైజామా ధరించి ఇండిన్ లుక్ లో కనిపించారు. సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'సుల్తాన్' మూవీ షూటింగ్ నిన్నటి వరకు హర్యానాలో జరిగింది. షూటింగ్ ముగియడంతో అంతా కలిసి ముంబై చేరుకున్నారు.

ఇటీవల సల్మాన్ ఖాన్ తల్లి సలీమ్ ఖాన్ మీడియాకు ఎదురు పడగా సల్మాన్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ...'పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనేది సల్మాన్ ఇష్టం. ఈ విషయంలో నేను కలుగజేసుకోడం లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అంగీకారమే' అంటూ సమాదానం ఇచ్చారు.

స్లైడ్ షోలో ఫోటోస్...

సల్మాన్, లులియా

సల్మాన్, లులియా


ముంబై ఎయిర్ పోర్టు నుండి బయటకు వస్తున్న సల్మాన్. సల్మాన్ తల్లి సుశీల చరక్ తో కలిసి లులియా.

బాగా క్లోజ్

బాగా క్లోజ్


సల్మాన్ ఖాన్ తో డేటింగ్ ప్రారంభించాక లులియా వాళ్ల ఫ్యామిలీకి చాలా క్లోజ్ అయింది.

లులియా వేంటర్

లులియా వేంటర్


లులియా వేంటర్ రొమేనియాకు చెందిన టీవీ యాంకర్. మెడల్.

సల్మాన్ తో పరిచయం

సల్మాన్ తో పరిచయం


ఎంటర్టెన్మెంట్ రంగానికి చెందిన వ్యక్తే కావడంతో సల్మాన్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది.

ప్రేమ

ప్రేమ


సల్మాన్ తో లులియా పరిచయం కాస్త ప్రేమగా మారింది.

త్వరలోనే వివాహం

త్వరలోనే వివాహం


త్వరలో సల్మాన్, లులియా వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.

ఇంట్లో ఒకే

ఇంట్లో ఒకే


సల్మాన్ వయసుల ఇపుడు 50 ప్లస్. ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నా ఇంట్లో వారికి సమ్మతమే.

ఇంకా ఖరారు కాలేదు

ఇంకా ఖరారు కాలేదు


అయితే పెళ్లి విషయాన్ని సల్మాన్ ఇంకా అఫీషియల్ గా ఖరారు చేయలేదు.

త్వరలోనే

త్వరలోనే


త్వరలోనే సల్మాన్ ఖాన్ వివాహం విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తగిన జోడీ

తగిన జోడీ


కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి లులియా వేంటర్ తగిన జోడీ అంటున్నారంతా.

English summary
Ever since the rumour of Salman Khan & Iulia Vantur's affair has been started running through the tinsel town, the duo are under media scan. Interestingly, many times the duo spotted together and now Salman & Iulia spotted together coming out from Mumbai airport.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu