»   »  సచిన్ బయోపిక్: ఓ మై గాడ్.. మాస్టర్ బ్లాస్టర్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే..

సచిన్ బయోపిక్: ఓ మై గాడ్.. మాస్టర్ బ్లాస్టర్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మైదానంలోనే కాదు వెండితెర మీద కూడా హవా కొనసాగిస్తున్నారు. సచిన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తున్నది. డాక్యుమెంటరీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఈ చిత్రంపై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రానికి సచిన్ తీసుకొన్న రెమ్యూనరేషన్‌పై ప్రస్తుతం భారీగా చర్చ జరుగుతున్నది.

మిల్కాసింగ్ ఒక్క రూపాయే..

మిల్కాసింగ్ ఒక్క రూపాయే..

ఇటీవల కాలంలో క్రీడా ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా భాగ్ మిల్కా భాగ్, అజర్, ఎంఎస్ ధోని లాంటి చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రాల్లో ఆయా ప్రముఖుల మాదిరిగా బాలీవుడ్ నటులు నటించారు. మిల్కా సింగ్ పాత్రను ఫరాన్ అఖ్తర్, అజర్ పాత్రను ఇమ్రాన్ హష్మీ, ఎంఎస్ ధోని పాత్రను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించారు. భాగ్ మిల్కా భాగ్ సినిమా కోసం మిల్కా సింగ్ కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకొన్నట్టు వార్తలు వచ్చాయి. అంతేతప్ప భారీ మొత్తాన్ని డిమాండ్ చేయలేదనేది వార్త సారాంశం.

భారీ బడ్జెట్‌తో..

భారీ బడ్జెట్‌తో..

తాజాగా వచ్చిన సచిన్ బయోపిక్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నటించాడు. డాక్యుమెంటరీ చిత్రంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్ర నిర్మాణం కోసం భారీగానే ఖర్చుపెట్టారు. ఈ చిత్ర ప్రమోషన్ కూడా భారీగా చేశారు. ఒకరోజు ముందుగానే ప్రముఖులందరికీ స్పెషల్ షో వేశారు. వారి ద్వారా సినిమాను కూడా ప్రమోట్ చేశారు. సచిన్ సినిమా గురించి ప్రముఖులు చెప్పిన విషయాలు అభిమానుల్లో ఆసక్తిని నింపింది.

మంచి ఓపెనింగ్స్..

మంచి ఓపెనింగ్స్..

అనుకున్నట్టుగానే సచిన్ సినిమాకు భారీ ఒపెనింగ్స్ వచ్చాయి. గత రెండు రోజుల్లో రూ.17 కోట్లు వసూళ్ల చేయడాన్ని సినీ వర్గాలు రికార్డుగా చెప్పుకొంటున్నారు. అయితే ఈ డాక్యుమెంటరీ సినిమా కోసం సచిన్ తీసుకొన్న రెమ్యూనరేషన్ మొత్తం ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశమవుతున్నది.

బాలీవుడ్ హీరోకు ఏ మాత్రం తగ్గని..

బాలీవుడ్ హీరోకు ఏ మాత్రం తగ్గని..

సచిన్ సినిమా ప్రొడక్షన్ వాళ్లు వెల్లడించిన ప్రకారం.. సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ సినిమా కోసం సచిన్ దాదాపు రూ.40 కోట్లు తీసుకొన్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రమోషన్‌ను సచిన్ స్వయంగా చేశారు. ఐపీఎల్‌తోపాటు పలు నగరాల్లో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా మాస్టర్ బ్లాస్టర్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లారు. సచిన్ తీసుకొన్న రెమ్యూనరేషన్ మొత్తం బడ్జెట్‌కు కలిపితే.. బాలీవుడ్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమాకు తీసుకొన్నమొత్తమని, హిందీ హీరోకు తీసుకొన్న మొత్తానికి ఏ మాత్రం తగ్గదనే విషయాన్ని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏది ఏమైనా క్రికెట్ నుంచి తప్పుకొన్నా గానీ సచిన్‌ క్రేజ్‌కు ఎదురే లేదనే విషయం ఈ సినిమా ద్వారా స్పష్టమైంది.

English summary
A source from the Sachin - A Billion Dreams production tells us, "It's somewhere close to Rs 40 crore. Maybe, not exactly 40 but he's definitely got 35-38 crore for the film." If you add that to the budget of the documentary film, it's almost as much as any other average Hindi feature film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu