»   »  పాకిస్థాన్ సెన్సార్ బోర్డు ముందుకు ఆ సినిమా....?

పాకిస్థాన్ సెన్సార్ బోర్డు ముందుకు ఆ సినిమా....?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మత్తులో పంజాబ్ బోర్డర్ దాటి పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన సరబ్‌జిత్ సింగ్ జీవితం ఆధారంగా ఆయన పేరుతోనే ఓ సినిమా తెరకెక్కుతోందన్న విషయం తెలుసు కదా . ఇదే తరహా కథతో మేరీకోమ్ సినిమా చేసిన ఓమంగ్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. సరబ్‌జిత్ సోదరి దల్బీర్ కౌర్‌గా ఐశ్వర్య నటిస్తోంది.

పాకిస్థాన్‌లో కూడా విడుదలైతే బాగుంటుందని ఒమంగ్ అంటున్నారు. ఆ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఏవీ లేవు కాబట్టి అక్కడ కూడా విడుదల చేయాలని ఆశిస్తున్నాడు. పాకిస్థానీ జైలులో అక్కడి ఖైదీల చేతిలో దాడికి గురై మరణించిన భారత పౌరుడు సరబ్‌జిత్ సింగ్ గురించి, అతడి ఆచూకీ కోసం అతడి సోదరి దల్బీర్ కౌర్ సాగించిన పోరాటం గురించి తీసిన ఈ సినిమా . పాకిస్థాన్ సెన్సార్ బోర్డుకు కూడా తమ సినిమా పంపుతున్నామని, వాళ్ల ఆమోదంతో అక్కడ కూడా దాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని ఒమంగ్ అంటున్నారు.

Omung Kumar Wants Sarbjit to Release in Pakistan

ఈ సినిమాలో టైటిల్ పాత్రలో రణదీప్ హూడా నటిస్తున్నాడు.,,ఇంతకుముందు ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా మేరీ కోమ్ సినిమా తీసి ఘన విజయం సాధించిన ఒమంగ్ కుమార్.. పాకిస్థానీ సెన్సార్ బోర్డు వాళ్లు తన సినిమా చూడాలని కోరుతున్నాడు. వాళ్లు సినిమా చూస్తే అంతా అర్థమవుతుందని చెబుతున్నాడు. సినిమా చూడకుండా అది తప్పని ఎవరైనా ఎందుకు అనాలన్నది ఒమంగ్ వాదన.

ఈ నెల 20వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో పవర్ ఫుల్ దల్బీర్ కౌర్ పాత్రలో ఐశ్వర్యారాయ్ నటిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో వృద్ధురాలి పాత్రలో ఉన్న ఐశ్వర్య లుక్ సినీ అభిమానులకు ఇప్పుడు పెద్ద షాక్ అయింది. అదే స్థాయిలో సినిమాపై అంచనాలను కూడా పెంచేసింది. ఇంకా ఇతర పాత్రల్లో రిచా ఛద్దా, దర్శన్ కుమార్ తదితరులు నటిస్తున్నారు.

English summary
Want my movie Sarbjit to release in Pakistan says Director Omung kumar
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu