»   » బాలయ్య వెరైటీగా భలే ఉన్నాడే : 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆన్ లొకేషన్ (ఫొటోలు)

బాలయ్య వెరైటీగా భలే ఉన్నాడే : 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆన్ లొకేషన్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే.. తెలుగుజాతీ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితాన్ని వెండితెరపై సాక్షాత్కరింప చేయనున్నారు దర్శకుడు క్రిష్, బాలయ్య మొరాకోలో షూటింగ్ మొదలెట్టిన సంగతి తెలిసిందే. అక్కడ లొకేషన్ ఫొటోలు మీకు అందిస్తున్నాం.

  మొరాకోలో మేజర్‌ యాక్షన్‌ పార్టును షూట్‌ చేయనున్నారు. అప్పట్లో ఇక్కడి శాత కర్ఫి రాజరికం చేసిన టైంలో కోటలూ గట్రా ఎలా ఉండేవో. మొరాకో దేశంలో కొన్ని ప్రాంతాలు అలాగే ఉన్నాయట.. అందుకే సెట్‌ వేయకుండా యాక్షన్‌ సన్నివేశాలను అక్కడ చిత్రీకరించి .. వాటికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ టచప్‌ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.


  Also Read: ఓ రేంజిలో ఇరగదీసారు: బాలయ్య...'గౌతమి పుత్ర శాతకర్ణి ' టీజర్ (వీడియో)


  ఇకపోతే మే ఇప్పటికే మొరాకో చేరుకుని షూటింగ్ మొదలుపెట్టిన బాలయ్య ..దాదాపు నెల నుంచి 40 రోజులపాటు అక్కడే ఉంటారట. అక్కడే దాదాపు యాక్షన్‌ సన్నివేశాలు.. అలాగే కొన్ని డైలాగ్‌ బేస్డ్‌ సీన్లు కూడ చిత్రీకరిస్తారని తెలుస్తోంది. వారు వేసుకున్న యాక్షన్ ప్లాన్ ప్రకారం ఆరు నెలల్లో సినిమాను రిలీజ్‌ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం.


  స్లైడ్ షోలో మిగతా డిటేల్స్ ..ఫొటోలు


  ఇందుకోసమే

  ఇందుకోసమే

  ఈ చిత్రంలో కేవలం యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ కోసం రూ. 8 కోట్లు వ్యయం చేస్తున్నారని సమాచారం.  అంతమందా

  అంతమందా

  ఈ చిత్రం ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ భూపతి ఇదివరకే ఆ దేశానికి చేరుకున్నారని, వార్ సీన్ కోసం సుమారు 800 మంది లోకల్ జూనియర్ ఆర్టిస్టులను ఎంపిక చేశారని అంటున్నారు.


  మనవాళ్లలాగే..

  మనవాళ్లలాగే..

  మొరాకోలో చాలామంది భారతీయుల తరహాలోనే ఉంటారని, అందువల్ల ఈ సెలెక్షన్ పెద్ద ప్రాబ్లం కాలేదని యూనిట్ వర్గాలు తెలిపాయి.  రెండు వారాలు పాటు

  రెండు వారాలు పాటు

  దాదాపు రెండు వారాల పాటు కంటిన్యూగా వార్ సీన్స్ షూట్ చేస్తారని సమాచారం  ఇక్కడ నుంచే అంతా

  ఇక్కడ నుంచే అంతా

  హైదరాబాద్ నుంచి ఆయుధాలు, ఇతర సామగ్రి..సుమారు నాలుగు టన్నుల మెటీరియల్ ను మొరాకోకు తరలించారని తెలిసింది.  రెండు ఫ్యాక్టరీలకు కాంటాక్ట్

  రెండు ఫ్యాక్టరీలకు కాంటాక్ట్

  యుద్ధంలో పాల్గొనే సైనిక పాత్రధారులకు ఆయుధాలు, గట్రా సప్లై చేసేందుకు మేకర్స్ హైదరాబాద్ లోని రెండు ఫ్యాక్టరీలకు కాంట్రాక్ట్ ఇచ్చారని తెలుస్తోంది.  చారిత్రక చిత్రాలకు అనువుగా

  చారిత్రక చిత్రాలకు అనువుగా

  మొరాకోలో చారిత్రాత్మక సినిమాలు తీసేందుకు అనువైన ప్రాంతాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయి.  ఇవన్నీ ఇక్కడ తీసినవే

  ఇవన్నీ ఇక్కడ తీసినవే

  గ్లాడియేటర్, గేమ్ ఆఫ్ థ్రాన్స్, బ్యాట్ మాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ , ది మమ్మీ వంటి హాలీవుడ్ సినిమాల షూటింగ్ మొరాకోలోనే జరిగింది అని ఈ వర్గాలు తెలిపాయి.  ఫస్ట్ లుక్ ని

  ఫస్ట్ లుక్ ని

  ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ జూన్ 10 బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.  రుద్రమదేవి ప్రేరణా

  రుద్రమదేవి ప్రేరణా

  గత సంవత్సరం గుణశేఖర్ నిర్మించి దర్శకత్వం వహించిన చారిత్రిక చిత్రం 'రుద్రమదేవి' హిట్ అయిన విషయం తెలిసిందే. అదే ప్రేరణతో ఈ చిత్రం మొదలెట్టినట్లు చెప్తున్నారు.


  బాలయ్య వెరైటీగా భలే ఉన్నాడే : 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆన్ లొకేషన్ (ఫొటోలు)

  బాలయ్య వెరైటీగా భలే ఉన్నాడే : 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆన్ లొకేషన్ (ఫొటోలు)

  ఇప్పటికే ఈసినిమా పాటల రికార్డింగ్ కు సంబంధించిన సిటింగ్స్ దేవిశ్రీప్రసాద్ ఆద్వర్యంలో అమెరికాలో జరుగుతున్న నేపధ్యంలో ఈసినిమా మ్యూజిక్ కు కూడ చాల ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.


  మోక్షజ్ఞ

  మోక్షజ్ఞ

  బాలయ్య కుమారుడు మోక్షజ్ఢ.. ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం మోక్షజ్ఞ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ముందు సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలనే అని చెప్తున్నారు.


  200 సంవత్సరాల క్రిందటి కథ

  200 సంవత్సరాల క్రిందటి కథ

  ‘గౌతమిపుత్ర శాతకర్ణి' జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రమిది. 200 సంవత్సరాల క్రిందట కథ ఇది.  లొకేషన్స్

  లొకేషన్స్

  200 సంవత్సరాల క్రితంకు తగిన లొకేషన్లను క్రిష్‌ యూరప్‌ లో ఎంపిక చేసారు.  దేవినే..

  దేవినే..

  ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించే అవకాశాలున్నాయి.  కీలకమైన పాత్రలో..

  కీలకమైన పాత్రలో..

  కీలకమైన పాత్రలో బాలీవుడ్‌ నటి హేమామాలినీ కనిపించనున్నారని మరో టాక్‌. అప్పుడెప్పుడో ‘పాండవ వనవాసం' చిత్రంలో హేమా కనిపించారు. ఆ తరవాత తెలుగులో నటించనే లేదు.  ఆ పాత్రమిటంటే...

  ఆ పాత్రమిటంటే...

  గౌతమి పుత్ర శాతకర్ణి తల్లి గౌతమి పాత్రలో ఆమె కనిపిస్తారని టాక్‌. ఈ పాత్ర కోసం శోభన పేరు కూడా పరిశీలనలో ఉంది.


  ద్విపాత్రాభినయం...

  ద్విపాత్రాభినయం...

  ఈ చిత్రంలో ఈ జనరేషన్ కు చెందిన వ్యక్తిగానూ, శాతవాహన సామ్రాజ్యాన్ని ఏలిన గౌతమి పుత్ర శాతకర్ణిగా ఆయన ద్విపాత్రాభినయం చేసి మెప్పించనున్నారు.  సోషల్ ఇష్యూలు

  సోషల్ ఇష్యూలు

  అలాగే ఈ చిత్రంలో కంచెలో లాగానే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని కాంటంపరరీ ఇష్యూలను సినిమాలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.  ఆ కాలం, ఈ కాలం

  ఆ కాలం, ఈ కాలం

  ఈ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి నాటికి, ఇప్పటి కాలానికి మధ్య జరుగుతుంది. ఆ కాలానికి ఈ కాలానికి మధ్య వ్యత్యాసం చూపుతుంది. చివర్లో మళ్లీ ఆ నాటి రోజులు రాబోతున్నాయని హింట్ ఇస్తారు.


  బడ్జెట్

  బడ్జెట్

  దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో భారీ ఎత్తున బాలకృష్ణ కెరీర్ లోనే నిలిచిపోయే చిత్రంగా రూపొందింస్తారు.  విడుదల ఎప్పుడు

  విడుదల ఎప్పుడు

  సంక్రాంతి 2017 న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.  English summary
  Krish has shared some pics from location and posted, ” A Sumptuous lunch after all the hard work on the 7th day of shoot. Love this Morocco and Indian food mix…”. The movie is all about the life history of Satakarni, the most popular king among Satavahanas, who ruled during 2nd Century CE. These are the stills from the sets of 'Gauthamiputra Satakarni' from Morocco. The film's shoot is under progress now. The film is being directed by Krish with Nandamuri Balakrishna playing the titular character. This is his 100th movie. In the shoot, Bollywood actor Kabir Bedi is also participating.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more