»   » మూడురోజుల్లోనే మరో మెగా బ్లాస్ట్... గేట్ రెడీ ఫర్ మెగా సర్ప్రైజ్

మూడురోజుల్లోనే మరో మెగా బ్లాస్ట్... గేట్ రెడీ ఫర్ మెగా సర్ప్రైజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ సంక్రాంతి మెగా, నందమూరి ఫ్యాన్స్ కి పెద్ద పండుగనే చెప్పాలి. అంతే కాదు ఈ సినిమాలతో పాటే 'శ‌త‌మానం భ‌వ‌తి' లాంటి మాంచి ఫ్యామిలీఎంట‌ర్ టైన‌ర్ కూడా రాబోతుంది. అంతే కాదు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి మరో పండుగ బంపర్ ఆఫర్..పవన్ 'కాట‌మ‌రాయుడు'మూవీకి సంబంధించిన టీజ‌ర్ కూడా సంక్రాంతి సంద‌ర్భంగానే సంద‌డి చేయ‌బోతోంది. ఈ నెల 14న సంక్రాంతి కానుక‌గా 'కాట‌మ‌రాయుడు' టీజ‌ర్ లాంచ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. 14న సాయంత్రం 7గంట‌ల‌కు కాట‌మ‌రాయుడు టీజ‌ర్ రిలీజ్ చేస్తార‌ట‌.

ఆ మద్య నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా పోస్టర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు వరుసగా సినిమాల పండగను కలిపించేందుకు మూడు సినిమాలను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో మొదటిదైన 'కాటమరాయుడు' కొద్దినెలల క్రితమే సెట్స్‌పైకి వెళ్ళి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా ఫస్ట్ టీజర్‌ను విడుదల చేసేందుకు టీమ్ సిద్ధమైపోయింది.


On Pongal.. Katamarayudu Teaser Release Date Confirmed

సంక్రాంతి పర్వదినం కానుకగా జనవరి 14న కాటమరాయుడు ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు టీమ్ స్పష్టం చేసింది. అయితే ఈ పోస్ట‌ర్ల విష‌యంలో కొంచెం మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. మ‌రి టీజ‌ర్ విష‌యంలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న అన్న‌య్య సినిమా 'ఖైదీ నెంబ‌ర్ 150' ప్రి రిలీజ్ ఈవెంట్ కు కూడా వెళ్ల‌కుండా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ నెలాఖ‌రులోపు సినిమా పూర్తి చేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. మార్చిలో ఉగాది కానుక‌గా ఈ చిత్రం వస్తుందని చెబుతున్నారు.

English summary
Katamarayudu teaser which scheduled to release for New Year is postponed to Sankranthi and now the date is confirmed for the sensational teaser. The teaser of Katamarayudu is releasing on 14th January 2017 whereas the time will be revealed soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X