»   » తమన్నా బర్త్ డే సెలబ్రేట్ చేసిన నాగార్జున, కార్తి (ఫోటోస్)

తమన్నా బర్త్ డే సెలబ్రేట్ చేసిన నాగార్జున, కార్తి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘ఊపిరి' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 21న తమన్నా పుట్టినరోజు. ఆ రోజు ఆమె షూటింగులో ఉండటంతో యూనిట్ సభ్యులు సెట్లోనే బర్త్ డే సెలబ్రేట్ చేసారు. తాజాగా ఆ ఫోటోలను చిత్ర నిర్మాణ సంస్థ ‘పీవీవీ సినిమా' సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది.

అక్కినేని నాగార్జున, తమిళ నటుడు కార్తీల కలయికలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఊపిరి' చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు విడుదల తేదీని ఫైనలైజ్ చేసారు. ట్రైడ్ వర్గాల్లో అందుతున్న సమచారం ప్రకారం ఫిబ్రవరి 5, 2016 న ఈ చిత్రం విడుదల కానుంది.


హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్' కి రీమేక్ గా ఊపిరి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క - అడవి శేష్ జంటగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే విదేశాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు.


కథకనుగుణంగా ఈ టైటిల్‌ను ఓకే చేసిన్నట్టు సమాచారం. గ్లామర్ తార తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగార్జున మాట్లాడుతూ ''ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ వినలేదు. వంశీ కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యా. మల్టీస్టారర్‌చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంద''న్నారు.


''నా సినిమాలన్నీ తెలుగులో అనువాద రూపంలో విడుదలయ్యాయి. తెలుగులో నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇది. నాగార్జునగారితో తెర పంచుకోవడం ఆనందంగా ఉంద''ని కార్తి తెలిపారు. ''నాగార్జున, కార్తి ఈ సినిమా చేస్తామని ముందుకు రావడంతో సగం విజయం సాధించినంత ఆనందంగా ఉంది. నేను రాసుకొన్న పాత్రలకు వాళ్లయితేనే పూర్తిగా న్యాయం చేస్తారనిపించింద''న్నారు వంశీ పైడిపల్లి. ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్‌, ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: శ్రీకర ప్రసాద్‌.


స్లైడ్ షోలో తమన్నా పుట్టినరోజు వేడుకలు...


తమన్నా

తమన్నా

తమన్నా పుట్టినరోజు వేడుకలు ఊపిరి సెట్లో ఘనంగా జరిగాయి.


పుట్టినరోజు

పుట్టినరోజు

ఈ నెల 21న తమన్నా పుట్టినరోజు. ఆ రోజు ఆమె షూటింగులో ఉండటంతో యూనిట్ సభ్యులు సెట్లోనే బర్త్ డే సెలబ్రేట్ చేసారు.


పీవీపీ సంస్థ

పీవీపీ సంస్థ

తాజాగా ఆ ఫోటోలను చిత్ర నిర్మాణ సంస్థ ‘పీవీవీ సినిమా' సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది


ఊపిరి

ఊపిరి

అక్కినేని నాగార్జున, తమిళ నటుడు కార్తీల కలయికలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఊపిరి' చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.


రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి. బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు విడుదల తేదీని ఫైనలైజ్ చేసారు. ట్రైడ్ వర్గాల్లో అందుతున్న సమచారం ప్రకారం ఫిబ్రవరి 5, 2016 న ఈ చిత్రం విడుదల కానుంది.


నాగ్

నాగ్

హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్' కి రీమేక్ గా ఊపిరి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు.
English summary
On the sets of Oopiri/Thozha, our beautiful Tamannaah, celebrated her birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu