»   » ప్రభాస్ మళ్ళీ ప్రభుదేవాతో???: పౌర్ణమి గుర్తొస్తోంది మరి

ప్రభాస్ మళ్ళీ ప్రభుదేవాతో???: పౌర్ణమి గుర్తొస్తోంది మరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

అటు బాహుబలి ఊపు ఇంకా తగ్గకముందే తన కొత్త సినిమా "సాహో" ని పూర్తి చేసి మళ్ళీ రెగ్యులర్ సినిమాల్లో పడాలని చూస్తున్నాడు ప్రభాస్. ఇంకా జనం బహుబలి గెటప్ లోనే ప్రభాస్ ని చూస్తూ ఉండటం తో మళ్ళీ రెగ్యులర్ లుక్ లో తొందరగా కనపడాలని తాపత్రయ పడుతున్నాడు.

సాహో

సాహో

భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న సాహో పై ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. ఈ సినిమా తరువాత ఆయన 'జిల్' దర్శకుడు రాధాకృష్ణతో కలిసి ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇక ప్రభుదేవా దర్శకత్వంలోను ప్రభాస్ ఒక సినిమా చేయనున్నాడనేది తాజా సమాచారం.

పౌర్ణమి

పౌర్ణమి

ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా ప్రభాస్‌తో వర్క్ చేయాలనుకుంటున్నానని, సాహో తర్వాత అతడితో చేస్తానని ప్రభుదేవా ఇటీవల ముంబైలో ఓ ప్రెస్ మీట్లో చెప్పినట్లు సమాచారం. గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్ ‘పౌర్ణమి' చిత్రం చేసిన సంగతి తెలిసిందే.

ప్రభుదేవా కెరీర్లోనే పెద్ద ప్లాప్

ప్రభుదేవా కెరీర్లోనే పెద్ద ప్లాప్

దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ప్రభుదేవా కెరీర్లోనే పెద్ద ప్లాప్. ఈ మధ్య ప్రభుదేవా ఫాంలో కూడా లేడు. మరి అలాంటి దర్శకుడితో ప్రభాస్ మరోసారి కలిసి పని చేయబోతున్నాడన్నది. ఇంకా నిజమా కాదా అన్న ఖచ్చితమైన సమాచారం మాత్రం తెలియదు. కానీ ప్రభుదేవా మాత్రం ఇప్పటికే సినిమా ఓకే అయినంత పక్కాగా చెప్పేస్తున్నాడు.

యాక్షన్‌ జాక్సన్‌

యాక్షన్‌ జాక్సన్‌

సినిమా కథ చెప్పిన వెంటనే ప్రభాస్‌ వెంటనే చేద్దామని గ్రీన్‌సిగల్‌ ఇచ్చాడట. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో' చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ‘‘ప్రభాస్‌ నా సన్నిహిత స్నేహితుడు. తెలుగు సినిమాల్లో అడుగుపెట్టినప్పట్నించీ అతను నాకు తెలుసు. నేను డైరెక్ట్‌ చేసిన ‘యాక్షన్‌ జాక్సన్‌' (అజయ్‌ దేవ్‌గణ్‌ చిత్రం)లో అతను అతిథి పాత్ర చేశాడు.

కరుప్పు రాజా వెళ్లై రాజా

కరుప్పు రాజా వెళ్లై రాజా

అతణ్ణి డైరెక్ట్‌ చేయాలనేది నా కోరిక. ‘బాహుబలి'వచ్చిందని మాత్రం కాదు. కొంత కాలం నుంచీ అతనితో సినిమా చేయాలని ఆలోచిస్తున్నా. ప్రస్తుతం అతను ‘సాహో'తో బిజీగా ఉన్నాడు. దాని తర్వాత మా సినిమా చేస్తాం'' అని చెప్పాడు ప్రభుదేవా. ప్రస్తుతం ప్రభుదేవా తమిళంలో ‘కరుప్పు రాజా వెళ్లై రాజా' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో విశాల్‌, కార్తీ హీరోలు.

English summary
After shooting for 'Saaho', the 'Baahubali' Prabhas is all set to collaborate once again with multi-talented personality Prabhudeva
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu