twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అప్పలరాజు' ఆడియో రిలీజ్ కి వర్మ వెరైటీ ప్లాన్

    By Srikanya
    |

    రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సెన్సేషన్ లేదా వెరైటీ ఏదో ఒకటి కావాలనుకుంటారు. తాజాగా ఆయన సునీల్ హీరోగా "కథ, స్క్రీన్ ప్లే, దర్సకత్వం :అప్పలరాజు" అనే చిత్రం డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోని రక్త చరిత్ర పార్ట్ 2 విడుదల(డిసెంబర్ 3) అనంతరం చేయనున్నారు. అయితే ఈ ఆడియో రిలీజ్ ఆయనో ప్రత్యేక పంధా అనుసరించనున్నారు. ఈ చిత్రంలో పన్నెండు పాటలను వారానికో పాటను చొప్పున విడుదల తేదీ దాకా విడుదల చేస్తూనే ఉంటారు. ఆయన తెలుగు ఫీల్డుకి తిరిగి రావటానికి పన్నెండు సంవత్సరాలు పట్టింది. అందుకు సింబాలిక్ గా ఈ ఆడియోని విడదలకు 12 రోజులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలోని పాటలన్నీ కామిడీగా ఉంటూనే సిట్యువేషన్ ప్రకారం వస్తాయని చెప్తున్నారు.

    సినీ పరిశ్రమ బ్యాక్ గ్రౌండ్ లో రెడీ అవుతన్న ఈ చిత్రంలో సునీల్..అమలాపురం నుంచి హైదరాబాద్ వచ్చి సినిమా తీయటం కథాంశం. సినిమా తీయటం వ్యవసాయం చేసినంత ఈజీ అనకునే అతను ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తాడు..విజయం ఎట్లా సాధిస్తాడనేది కథ అని చెప్తున్నారు. వర్మ..కాంటాక్ట్ చిత్రంతో పరిచయమైన సాక్షి ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. అలాగే కలర్స్ స్వాతీ ఈ చిత్రంలో అసెస్టెంట్ డైరక్టర్ గా కనపడుతూ నవ్వులు పండించనుంది. సంక్రాంతి రోజు విడుదల అయ్యే ఈ చిత్రం కోసం వర్మ ఓ పాటను సైతం రాసారు. కోనేరు కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్‌, కృష్ణుడు, వేణుమాధవ్‌, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్‌ వర్మ.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X