»   » ఆడది కనిపిస్తే ఆంబోతులా నోరు తెరుచుకోవడమే.... కమెడియన్ల అడల్ట్ వేషాలు!

ఆడది కనిపిస్తే ఆంబోతులా నోరు తెరుచుకోవడమే.... కమెడియన్ల అడల్ట్ వేషాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఆడది కనిపిస్తే ఆంబోతులా నోరు తెరుచుకోవడమే..!!

ఈ మధ్య కాలంలో తెలుగులో అడల్ట్ కామెడీ సినిమాలు వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును పూడుస్తూ త్వరలో శృంగార భరిత హాస్య చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'ఊపెకుహ '(ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి) టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

టాలీవుడ్ కమెడియన్లంతా నటిస్తున్నారు

టాలీవుడ్ కమెడియన్లంతా నటిస్తున్నారు

ఈ చిత్రంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన టాప్ కమెడియన్లు నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన అడల్ట్ కామెడీ అనే భావన కలుగుతోంది.

రాజేంద్రప్రసాద్, సాక్షి చౌదరి

రాజేంద్రప్రసాద్, సాక్షి చౌదరి

దర్శకుడు నిధి ప్రసాద్‌ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని జేబీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రాజేంద్రప్రసాద్‌, సాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు బ్రహ్మానందం, అలీ, ధనరాజ్, కృష్ణ భగవాన్ లాంటి టాప్ కమెడియన్లు నటిస్తున్నారు.

హాట్ హాట్ భామలు

ఈ చిత్రంలో చాలా మంది కొత్త అమ్మాయిలు నటిస్తున్నారు. వారి అందాల ఆరబోతతో స్క్రీన్ వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. దర్శకుడు ఈ చిత్రంలో గ్లామర్ మసాలా బాగా దట్టించినట్లు స్పష్టమవుతోంది.

దర్శకుడు నిధి ప్రసాద్

దర్శకుడు నిధి ప్రసాద్

దర్శకుడు నిధి ప్రసాద్‌ మాట్లాడుతూ...'నేను దర్శకత్వానికి దూరంగా ఉండి చాలాకాలమవుతోంది. ఇక ఇప్పుడు నువ్వు సినిమాలు తీయలేవని చాలా మంది నిరుత్సాహపరిచారు. అయితే వాళ్లు చెప్పిన దానికి పరిశ్రమలోని పరిస్థితులకు సంబంధం లేదు. అంతా సహకరించారు. కథ పూర్తి అయిన తర్వాత నమ్మకం పెరిగి, మా కుటుంబ సభ్యులతోనే సినిమా చేశాను. అనుకున్న విధంగా సినిమా రావడం సంతోషంగా ఉంది. ‘ అన్నారు.

టెమ్ట్ చేస్తున్న టీజర్

తాజాగా విడుదలైన ‘ఉపెకుహ' టీజర్ అడల్ట్ కామెడీ ఇష్టపడే సినీ అభిమానులను టెమ్ట్ చేస్తోంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

English summary
Oollo Pelliki Kukkala Hadavidi Movie Teaser released. The movie starring Rajendra Prasad, Sakshi Chaudhary directed by Nidhi Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu