»   » ‘ఊపిరి’ ఆడియో : అనసూయ డాన్సే హైలెట్ (ఫోటోస్)

‘ఊపిరి’ ఆడియో : అనసూయ డాన్సే హైలెట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై దర్శకుడు వంశీ పైడిపల్లి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఊపిరి'. పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. ఈ ఆడియో మంగళవారం నోవాటెల్ లో జరిగింది.

ఈ కార్యక్రమంలోకె.రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున, అమల, కార్తీ, ప్రకాష్ రాజ్, జయసుధ, పివిపి,వంశీపైడిపల్లి, సుమంత్, గాబ్రియల్, జెమిని కిరణ్, కళ్యాణ్ కృష్ణ, ఎడిటర్ మధు, అశ్వనీదత్, సుశాంత్, హరీష్ శంకర్, అబ్బూరి రవి, రామజోగయ్యశాస్త్రి, దిల్ రాజు, రఘరాంరాజు, అడవి శేష్, శ్రీచరణ్, కాజల్ అగర్వాల్, దశరథ్, అలీ తదితరులు పాల్గొన్నారు.


అక్కినేని అమల ఆడియో సీడాలను విడుదల చేసారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆట పాట కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యాంకర్ అనసూయ సోగ్గాడే చిన్ని నాయనా మూవీలోని పాటలకు స్టెప్స్ వేస్తూ చేసిన డాన్స్ ఆడియో వేడుకకు హైలెట్ అయింది.


రామ్ చరణ్ మూవీలో అనసూయ ఐటం సాంగ్?


అక్కినేని నాగార్జున మాట్లాడుతూ....నాలుగేళ్ళ క్రితం నేను, అమల ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ‘ది ఇన్‌టచబుల్స్' చూశాం. ఇద్దరికీ సినిమా బాగా నచ్చింది. ఈ సినిమాను ఎవరైనా తెలుగులో చేస్తే బావుంటుందని, అందులో నేను రోల్ చేస్తే బావుంటుందని అనుకున్నాను. గట్టిగా కోరుకుంటే జరుగుతుందని ఎవరో అన్నట్టు మూడేళ్ళ తర్వాత వంశీ ‘ది ఇన్‌టచబుల్స్' సీడీ ఇచ్చి సినిమా చూడమన్నాడు. నేను వీల్ చెయిర్లో కూర్చొనే రోల్ చేశానని ఎవరూ అనుకోవద్దు. సినిమాలో కాళ్ళు, చేతలు పడిపోయినా మనసు పరిగెత్తుతూనే ఉంటుంది. ఎంటర్ టైన్మెంట్, లవ్, ఫ్రెండ్ షిప్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. వంశీ అన్నీ చక్కగా చూపించాడు. మనిషికి ఒక తోడు కావాలి. ఆ తోడు ఎంత అవసరమో ఈ సినిమా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ సినిమాలో నాకు కార్తీ తోడుగా నటించాడు. కార్తీ ఫెంటాస్టిక్ యాక్టర్. గుడ్ ఫ్రెండ్. సినిమా గ్యారంటీ హిట్టవుతుంది. ఈ సినిమాతో నాకొక ఫ్రెండ్, తమ్ముడు దొరికాడు. ఈ సినిమాకు మరో ఊపిరి పివిపి. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్. శివ, గీతాంజలి, అన్నమయ్య సినిమాకు వచ్చినంత మంచి పేరు ఈ సినిమాకు వస్తుంది'' అన్నారు.


స్లైడ్ షోటో ఫోటోస్...


కార్తీ మాట్లాడుతూ....

కార్తీ మాట్లాడుతూ....

వంశీ మన నెటివిటీకి తగిన విధంగా బ్యూటీఫుల్ అడాప్టెషన్ తో ఊపిరి సినిమాను చేశాడు. నాగార్జునగారు ఈ సినిమాలో నటిస్తున్నారనగానే ఈ సినిమాలో నటించడానికి డబుల్ ఓకే చెప్పాను. ఆయనతో నటించడం లైఫ్ లాంగ్ గిఫ్ట్ దొరికినట్టయింద అన్నారు.


నాగార్జున రోల్ గురించి

నాగార్జున రోల్ గురించి

ఎంటైర్ లైఫ్ లో ప్రతి క్షణాన్ని ఎలా సెలబ్రేట్ చేయాలో తెలిసిన వ్యక్తిగా నాగార్జునగారి నటన చూసి అందరం ఏడ్చేశాం. రేపు ఆడియెన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు అని కార్తి అన్నారు.


నిర్మాత

నిర్మాత

పివిపి మాట్లాడుతూ ‘'నాగార్జున, కార్తీలే ఈ సినిమాకు ఊపిరి. ఎంతో సపోర్ట్ చేశారు. వారితో సహా సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.


ప్రకాష్ రాజ్..

ప్రకాష్ రాజ్..

వంశీతో మూడో సినిమా. తను ఇలాంటి సినిమా చేస్తాడని నమ్మలేదు. కొత్తగా ప్రయత్నించాడు. నేను కూడా విలక్షణమైన పాత్రలో కనపడతాను. మన మనసు, అనుభవం, అనుబంధాలతో చూడాల్సిన సినిమాయే ఊపిరి అన్నారు.


వంశీపైడిపల్లి మాట్లాడుతూ..

వంశీపైడిపల్లి మాట్లాడుతూ..

సినిమా రూపొందడానికి కారణం నాగార్జున, కార్తీ, పివిపిగారే. నేను చెప్పగానే ఆయన ఒక్క క్షణం కూడా జంకకుండా పివిపిగారు సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని చూస్తే భయమేసింది. ఆయన నన్ను ఎంకరేజ్ చేసిన తీరుని మాటల్లో వర్ణించలేను అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్

మ్యూజిక్ డైరెక్టర్

మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ మాట్లాడుతూ ‘'ఊపిరి సూపర్ హిట్ చిత్రమవుతుంది'' అన్నారు.


ఆడియో వేడుకలో...

ఆడియో వేడుకలో...

ఈ కార్యక్రమంలోకె.రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున, అమల, కార్తీ, ప్రకాష్ రాజ్, జయసుధ, పివిపి,వంశీపైడిపల్లి, సుమంత్, గాబ్రియల్, జెమిని కిరణ్, కళ్యాణ్ కృష్ణ, ఎడిటర్ మధు, అశ్వనీదత్, సుశాంత్, హరీష్ శంకర్, అబ్బూరి రవి, రామజోగయ్యశాస్త్రి, దిల్ రాజు, రఘరాంరాజు, అడవి శేష్, శ్రీచరణ్, కాజల్ అగర్వాల్, దశరథ్, అలీ తదితరులు పాల్గొన్నారు.


నోవాటెల్

నోవాటెల్

పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు. ఈ ఆడియో మంగళవారం నోవాటెల్ లో జరిగింది.


ఊపిరి

ఊపిరి

నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై దర్శకుడు వంశీ పైడిపల్లి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఊపిరి'.


అమల

అమల

ఆడియో సీడీలను అక్కినేని అమల విడుదల చేశారు.


తారాగణం

తారాగణం

నాగార్జున, కార్తీ, తమన్నా భాటియా, జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


తెర వెనక

తెర వెనక

ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ఎడిటింగ్‌: మధు, ఫైట్స్‌: కలోయిన్‌ ఒదెనిచరోవ్‌, కె.రవివర్మ, సిల్వ, డాన్స్‌: రాజు సుందరం, బృంద, స్టోరీ అడాప్షన్‌: వంశీ పైడిపల్లి, సాల్మన్‌, హరి, మాటలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, సమర్పణ: పెరల్‌ వి.పొట్లూరి, నిర్మాతలు: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


English summary
Oopiri Movie Audio Launch event held at Hyderabad. Nagarjuna Akkineni, Karthi, Amala Akkineni, K.Raghavendra Rao, Anasuya Bharadwaj, Karuna, Prasad V Potluri, Vamsi Paidipally, Suma, Prakash Raj graced the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu