»   » ‘ఊపిరి’ పోస్టర్ మేకింగ్ కోసం ఇంత హంగామానా? (వీడియో)

‘ఊపిరి’ పోస్టర్ మేకింగ్ కోసం ఇంత హంగామానా? (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాల బిజినెస్ వారం లేదా రెండు వారాల్లోనే ముగిసి పోతున్న ప్రస్తుత రోజుల్లో సినిమాలకు ప్రమోషన్స్ చాలా కీలకంగా మారాయి. సినిమా విడుదల ముందే కావాల్సినంత ప్రచారం జరగాలి. సినిమా ఓపెనింగ్ డే వచ్చే వసూళ్లే సినిమాలకు చాలా కీలకంగా మారాయి. పరిస్థితులకు అనుగుణంగా నిర్మాతలు కూడా పబ్లిసిటీ కోసం చాలా ఖర్చు పెడుతున్నారు.

Oopiri Movie Poster Making

సినిమా విడుదల ముందే ప్ర్రత్యేకంగా ఫోటో షూట్లు, ట్రైలర్స్ రిలీజ్ చేస్తూ జనాల్లో సినిమాపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. జనాలకు థియేటర్లకు రాబట్టడానికి పోస్టర్స్ కూడా కీలకం అయ్యాయి. కేవలం పోస్టర్ డిజైన్ కోసమే భారీగా ఖర్చు పెట్టి స్పెషల్ గా ఫోటో షూట్లు చేస్తున్నారు. నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ఊపిరి' సినిమా కోసం కూడా ప్రత్యేకంగా పోస్టర్ మేకింగ్ ఫోటో షూట్ నిర్వహించారు.

'ఊపిరి' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు (మార్చి 25) సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది.పివిపి సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 60 కోట్ల ఖర్చు తెరకెక్కించారు. ఇందులో నాగార్జున పూర్తిగా వీల్‌ ఛైర్‌కే పరిమితమయ్యే పాత్రను చేసారు. ఈ సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టడానికి కారణం ఇద్దరు స్టార్స్ ఉండటమే. నాగార్జున నటిస్తుండటంతో ఇటు తెలుగులో.... కార్తి నటిస్తుండటంతో అటు తమిళంలో సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తుందని, మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో సినిమాను వరల్డ్ వైడ్ గా 2 వేల థియేటర్లలో ఆంద్రప్రధేశ్, తెలంగాణ, తమిళనాడు , కర్ణాటక, నార్త్ ఇండియా, యు.ఎస్, గల్ఫ్ కంట్రీస్, మలేషియా, శ్రీలంక, సింగపూర్, యు.కె, ఆప్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నామని నిర్మాత తెలిపారు.

English summary
Oopiri Telugu Movie Poster Making by Anil & Bhanu. Oopiri movie ft. Nagarjuna, Karthi and Tamanna in lead roles. Directed by Vamshi Paidipally, produced by Prasad V Potluri and music by Gopi Sunder.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu