»   »  మహేష్‌ భయం అదే: ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్‌పై డైలమా!

మహేష్‌ భయం అదే: ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్‌పై డైలమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బ్రహ్మోత్సవం' రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు డైలమాలో పడ్డారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాల్సి ఉన్నా షూటింగ్ లేటవ్వడంతో మే నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు సినిమాలు మే నెలలో రిలీజ్ అయి చాలా కాలం అయింది....పైగా ఈ నెలలో రిలీజైన మహేష్ చిత్రాలు 'నిజం', 'నాని' బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యాయి.

దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ మే నెలలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే సెంటిమెంటు పరంగా ఈ నెల మళ్లీ దెబ్బ కొడుతుందని భయపడుతున్నారట. అసలే మహేష్ బాబు గత సినిమా 'శ్రీమంతుడు' భారీ విజయం సాధించింది. మహేష్ బాబుకు హిట్టు తర్వాత మళ్లీ హిట్టొచ్చిన దాఖలాలు అసలు లేవు.


OOPS! Mahesh Babu's Brahmotsavam Pushed To May End

అయినా దైర్యం చేసి మే నెలలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సారి ఎలాగైనా మే నెల సెంటిమెంటును అధిగమించాలని డిసైడ్ అయ్యారట. మే 20 లేదా మే 27న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంకా రిలీజ్ డేట్ అఫీషియల్ గా ఖరారు కాలేదు. తర్వాత నిర్ణయం మార్చుకుని జూన్ వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.


పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయవాడ బ్యాక్ డ్రాప్ తో సినిమా సాగుతుంది. మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు.

English summary
According to our reliable sources, the release date of Mahesh Babu's Brahmotsavam has been pushed to 27 May. The film has faced several postpones till now and it was in fact slated for an April release initially.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu