»   » షాకింగ్ మూమెంట్ : భార్య ముందే బిగ్‌బి అలా..!

షాకింగ్ మూమెంట్ : భార్య ముందే బిగ్‌బి అలా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: వెండితెర రొమాన్స్ హిట్ ఫెయిర్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచిన అమితాబ్ బచ్చన్, రేఖ అప్పట్లో బాలీవుడ్లో ఓ సంచలనం. 70వ దశకంలో అమితాబ్, రేఖ జంటగా నటించిన అనేక చిత్రాలు విజయం సాధించాయి. ఆ తర్వాత ఇద్దరిమధ్య ప్రేమాయణం నడిచినట్లు వార్తలు రావడం.. కుటుంబాల్లో కలహాలు.. వెరసి ఈ జంట వెండితెరపై కలిసి నటించలేదు. పైగా అమితాబ్ భార్య జయా బచ్చన్‌కు రేఖకు ఏ మాత్రం పొసగదన్న వార్తలు ఉన్నాయి.

బాలీవుడ్‌లో వీరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఇప్పటికీ పలువురికి ఆసక్తే. ఎప్పుడైనా ఏదైనా సినిమా ఫంక్షన్లో అమితాబ్, రేఖ ఎదురు పడినా.....పలకరించుకున్న సందర్భాలు కూడా తక్కువే. తన వెంట భార్య జయా బచ్చన్ ఉంటే......రేఖ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేసే వారు కాదు అమితాబ్.

Oops, What's This - Amitabh, Jaya Bachchan Greet Rekha!

కానీ ఇటీవల ముంబైలో జరిగిన 20వ స్క్రీన్ అవార్డ్స్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అమితాబ్ బచ్చన్ వెళ్లి స్వయంగా రేఖను గ్రీటింగ్స్ చెప్పారు. ఫోటోగ్రాఫులకు ఫోజు ఇచ్చాడు. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ వెంట ఆయన భార్య జయా బచ్చన్ కూడా ఉండటం గమనార్హం.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... అమితాబ్ బచ్చన్, రేఖ జోడీ త్వరలో మళ్లీ వెండితెరపై మెరువనుందట! 'వెల్‌కమ్' సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన దర్శకుడు అనీస్ బజ్‌మీ.. అదే సినిమాకు కొనసాగింపుగా 'వెల్‌కమ్ బ్యాక్' పేరిట కామెడీ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్, రేఖ జంటగా నటించేందుకు అంగీకరించారని అనీస్ ప్రకటించారు. ఇది ఎంతవరకు వర్క్‌ఔట్ అవుతుందో చూడాలని బాలీవుడ్‌వర్గాలంటున్నాయి!

English summary

 In one of the most interesting 'turn' of events, Amitabh Bachchan was photographed greeting actress Rekha with a 'namaste' at the 20th Annual Screen Awards that took place last night. In fact, Jaya Bachchan too was spotted bonding with the yesteryear queen at the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu