'అష్టా చెమ్మా' ఐడియా అందులోది!!

అందులో జాక్ ఓ పెద్దింటి కుర్రాడు తన పల్లెలో చాలా గొప్పవాడిగా అందరితో విపరీతంగా గౌరవింపబడుతూంటాడు. దాంతో తప్పని సరిగీ అతను ఆ ఇమేజ్ కి తగినట్లు బిహేవ్ చేయాల్సి వస్తుంది. దాంతో సరదాలు తీరని అతను లండన్ వచ్చి ఎర్నెన్ట్ అనే మారు పేరుతో ఎంజాయ్ చేస్తూంటాడు. అలాగే అక్కడ ఎర్నస్ట్ అనే పేరుని విపరీతంగా అభిమానించే అమ్మాయి Gwendolyn పరిచయమవతుంది. ఇద్దరి లవ్ ఎక్కడికి దారితీసిందనేది ఆ కథ.
ఈ నాటకం 2002 లో అదే పేరుతో సినిమాగా వచ్చింది. దాన్నిమోహన్ కృష్ణ తను విజయవాడ లయోలా కాలేజిలో బి.ఎ లిటరేచర్ చదువుకునేటప్పుడు అధ్యయనం చేసారు. దాన్ని ఇప్పుడు కాలానికి మార్చి హిట్ కొట్టాడు. అలాగే నేను ఆస్కార్ వైల్డ్ నాటకం నుండి ప్రేరణ పొందానని చెప్పి అందరి అభినందనలూ అందుకుంటున్నారు. అలాగే ఓ ఆస్కార్ వైల్డ్ అభిమాని ఆయనకు ఫోన్ చేసి నేను ఆ నాటకాన్ని తెలుగులోకి ట్రాన్స్ లేట్ చేద్దామనుకున్నాం ఇప్పుడు అష్టాచెమ్మా చూసాక అనవసరం అనిపిస్తోంది అన్నాడుట. గ్రేట్ కదా...


Click it and Unblock the Notifications











