Don't Miss!
- News
ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంటికి వెళ్లిన జగన్ దంపతులు
- Finance
Twitter Blue: శుభవార్త చెప్పిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ బ్లూ ఖాతాదారులకు కనకవర్షం..
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Oscar Awards 2022: వైభవంగా ఆస్కార్ వేడుక.. ఒకే సినిమాకు ఆరు అవార్డులు
సినీ రంగానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులే 'ఆస్కార్'. ప్రతి ఏడాది చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే అత్యుత్తమ బహుమతులు కావడంతో.. వీటి ప్రదానోత్సవ కార్యక్రమాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి. అయితే, రెండేళ్లుగా కరోనా ప్రభావం కారణంగా ఈ ఈవెంట్లు కళ తప్పాయనే చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో 94వ అకాడమీ అవార్డులు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోన్న ఈ అవార్డుల కార్యక్రమంలోనే ఇప్పటి వరకూ విజేతలుగా నిలిచింది ఎవరు? ఏ సినిమా ఎక్కువ డామినేట్ చేసింది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి!

వైభవంగా జరుగుతోన్న ఈవెంట్
94వ ఆస్కార్ అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమం లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతోంది. అంగరంగ వైభవంగా జరుగుతోన్న ఈ వేడుకలో తారల తళుకుబెళుకులు కనిపిస్తున్నాయి. మొత్తం 23 విభాగాల్లో అవార్డులను ప్రకటించబోతున్నారు. దీనికోసం ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖులు విచ్చేశారు. కొందరు ప్రత్యేకమైన ప్రదర్శనలు కూడా ఇస్తున్నారు.
Bigg Boss Non Stop: అఖిల్ అక్కడ చేయి పెట్టాడన్న హమీదా.. ‘ప్రైవేట్ పార్ట్' వీడియో చూపించడంతో!

అస్కార్ చరిత్రలో ఇదే తొలిసారి
సినీ రంగంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఎప్పుడూ జరిగినా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. ఈ సారి ఈ ఈవెంట్‌ను అమీ షుమెర్, వాండా సైక్స్, రెజీనా హాల్ అనే ముగ్గురు మహిళా యాంకర్స్ హాస్ట్ చేస్తున్నారు. అకాడమీ అవార్డుల చరిత్రలోనే ఇలా ముగ్గురు మహిళలు ఒకేసారి హోస్ట్ చేయడం ఇదే తొలిసారి. దీంతో ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆ నాలుగు చిత్రాలకే ఎక్కువగా
94వ
ఆస్కార్
అవార్డుల్లో
భాగంగా
‘ద
పవర్
ఆఫ్
ది
డాగ్'
చిత్రం
ఏకంగా
12
నామినేషన్లు
దక్కించుకుంది.
అలాగే,
‘డ్యూన్'
చిత్రం
పది
విభాగాల్లో,
‘వెస్ట్
సైడ్
స్టోరీ',
‘బెల్‌ఫాస్ట్'
చిత్రాలకు
ఏడేసి
చొప్పున
నామినేషన్లు
లభించాయి.
అత్యధిక
నామినేషన్లు
దక్కించుకున్న
ఈ
నాలుగు
చిత్రాలూ
ఉత్తమ
చిత్రం
విభాగంలో
ఉన్నాయి.
దీంతో
అందరిలో
ఆసక్తి
నెలకొంది.
RRR 3rd Day Collection: తెలుగులో మరో సంచలన రికార్డు.. ప్రభాస్, బన్నీ, పవన్‌ను వెనక్కి నెట్టిస్తూ!

హవాను చూపించిన డ్యూన్ ఫిల్మ్
డెన్నిస్ విల్లెనియువ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘డ్యూన్'. టిమోతీ చలమేట్, రెబాకా ఫెర్గ్యూసన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా పది విభాగాల్లో నామినేట్ అయింది. ఇప్పటికే ప్రకటించిన విభాగాల్లో దీనికి సినిమాటోగ్రఫీ, బెస్ట్ సౌండ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్‌లో అవార్డులు సొంతం అయ్యాయి.

ఉత్తమ నటుడు.. ఉత్తమ డైరెక్టర్
అంగరంగ వైభవంగా జరుగుతోన్న 94వ ఆస్కార్ అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమంలో తాజాగా ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ నటుడు విభాగాలను ప్రకటించారు. ఇందులో కింగ్ రిచర్డ్స్ చిత్రానికి గానూ విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. అలాగే, ఉత్తమ దర్శకుడిగా జాన్ కాంపియన్ ఎంపికయ్యాడు. ది పవర్ ఆఫ్ ది డాగ్ చిత్రానికి గానూ ఆయన ఈ అవార్డుకు ఎంపిక అయ్యాడు.
బాత్రూంలో నగ్నంగా హీరోయిన్: తల్లైనా తర్వాత కూడా ఇంత దారుణంగా!
Recommended Video


మిగిలిన విభాగాల విజేతలు వీళ్లే
ఇప్పటి వరకూ ప్రకటించిన అవార్డుల్లో విజేతలుగా నిలిచింది ఎవరంటే.. ఉత్తమ సహాయ నటుడిగా ట్రాయ్ కాట్సర్, ఉత్తమ సహాయ నటిగా ఆరియానా డిబోస్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే కెన్నెత్ బ్రనాగ్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జెన్నీ బెవాస్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా గ్రేగ్ ఫ్రేజర్, ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్‌గా డ్రైవ్ మై కార్, ఉత్తమ ఒరిజినల్ సింగర్‌గా బిల్లీ ఎలీష్ ఎంపికయ్యారు. మరిన్ని వివరాలు మరికాసేపట్లో...